Home Entertainment honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌...

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

honey rose | సీనియర్‌ హీరోలకు కథలు దొరుకుతున్నాయి.. కానీ హీరోయిన్లు మాత్రం అంత ఈజీగా దొరకట్లేదు. ఇప్పుడు ఉన్న హీరోయిన్ల అంతా హీరోల పక్కన కూతుళ్లలా కనిపిస్తున్నారు. సీనియర్‌ హీరోయిన్లను తీసుకుందామా అంటే వాళ్లకేమో క్రేజ్‌ తగ్గిపోయింది. దీంతో స్టార్‌ హీరోల సినిమాలకు హీరోయిన్లను సెట్‌ చేయడానికి యుద్ధాలే చేయాల్సి వస్తుంది.

చిరంజీవి రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఖైదీ నంబర్‌ 150లో కాజల్‌ను హీరోయిన్‌గా సెట్‌ చేసుకున్నాడు. వీళ్లిద్దరి జోడీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సైరా సినిమాకు నయనతార, తమన్నాను తీసుకున్నాడు. ఇక మూడో సినిమా ఆచార్య మొదలుపెడితే ఏ హీరోయిన్‌ను తీసుకోవాలో అర్థం కాలేదు. మళ్లీ కాజల్‌నే హీరోయిన్‌గా సెట్‌ చేశారు. కొన్ని సీన్స్‌ కూడా షూట్‌ చేశారు. తీరా కాజల్‌ పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్‌ కావడంతో ఆమెను తప్పించారు. చిరు పక్కన హీరోయిన్‌ లేకుండానే సినిమాను రిలీజ్‌ చేశారు.

గాడ్‌ ఫాదర్‌ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే రిపీట్‌ అయ్యింది. ముందు సీనియర్‌ హీరోయిన్‌ త్రిషను తీసుకుందామని అనుకుంటే ఆమె ఒప్పుకోలేదు. నయనతార ఆల్రెడీ చెల్లెలు రోల్‌కి కన్ఫార్మ్‌ అయిపోయింది. తమన్నాను తీసుకుందామంటే.. ఆల్రెడీ భోళాశంకర్‌ సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా చేస్తుంది. అంతకుముందు సైరా నరసింహారెడ్డిలో ఇద్దరూ కలిసి నటించారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్‌ను తీసుకుందామంటే ఎవరూ సెట్‌ అయ్యే పరిస్థితి లేదు. దీంతో చేసేదేమీ లేక హీరోయిన్‌ లేకుండానే ఈ సినిమాను కూడా రిలీజ్‌ చేశారు.

చిరంజీవికే కాదు బాలకృష్ణకు కూడా సేమ్‌ ప్రాబ్లెం. హీరోయిన్లు సెట్‌ అవ్వగా.. చేసిన హీరోయిన్లతోనే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. వీళ్లే కాదు చాలామంది సీనియర్ స్టార్ హీరోలకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో వీళ్లకు ఒక బెస్ట్‌ ఆప్షన్‌ దొరికేసింది. ఆమె ఎవరో కాదు మలయాళ బ్యూటీ హనీ రోజ్‌.

వీరసింహారెడ్డి సినిమాలో ఫస్టాఫ్‌లో బాలకృష్ణకు తల్లిగా, సెకండాఫ్‌లో ప్రియురాలిగా మెప్పించింది హనీ రోజ్. చీరకట్టులో హుందాగా.. మోడ్రన్ లుక్‌లో హాట్‌గా కనిపించింది. రెండింటిలోనూ చక్కటి వేరియషన్ చూపించింది. దీంతో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ దొరికేసిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

నిజానికి 2008లో వచ్చిన ఆలయం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్‌. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా కూడా చేసింది. ఈ రెండు సినిమాలు సక్సెస్‌ కాకపోవడంతో మలయాళ ఇండస్ట్రీలోనే సెటిల్‌ అయ్యింది. ఇప్పుడు వీరసింహారెడ్డితో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుని అందరి కళ్లలో పడింది. వీరసింహారెడ్డిలో ఈమె చూపించిన వేరియేషన్‌ చూసిన టాలీవుడ్‌ వర్గాలు.. హనీరోజ్‌ సీనియర్‌ స్టార్‌ హీరోలకు బెస్ట్‌ ఆప్షన్‌గా మారుతుందని అనుకుంటున్నాయి. మరి నిజంగా స్టార్‌ హీరోలకు బెస్ట్‌ ఆప్షన్‌గా మారుతుందో లేదో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

priyanka jawalkar | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా నటించను.. ప్రియాంక జవాల్కర్ సంచలన వ్యాఖ్యలు

Dil Raju Marriage | దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? ఏడాది వెంటపడి మరీ ప్రపోజ్ చేశాడా?

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Exit mobile version