Home Entertainment Rashmi Gautam | కోడికి లేని బాధ నీకెందుకు.. నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన...

Rashmi Gautam | కోడికి లేని బాధ నీకెందుకు.. నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన రష్మి

Image Source: Rashmi Gautam Instagram

Rashmi Gautam మూగజీవులపై జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌కి ఎంతో ప్రేమ. ఈ విషయాన్ని చాలాసార్లు వ్యక్తపరిచింది. నోరు లేని జంతువులను చిత్రహింసలకు గురిచేసిన వాళ్లపై చాలాసార్లు విరుచుకుపడింది. దీపావళి వచ్చిందంటే వీధి కుక్కలకు హాని చేయొద్దని కోరేది. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి కోడి పందేలపై కూడా రష్మి స్పందించింది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వివాదంగా మారింది.

సంక్రాంతి కోడి పందేల్లో పాల్గొన్న ఒక డాక్టర్ తన ఆనందాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు. తాను రెండు పందేల్లో గెలిచానని.. బాగా ఎంజాయ్‌ చేశానని పేర్కొన్నాడు. ఈ స్టోరీని గమనించిన రష్మీ గౌతమ్‌ స్క్రీన్‌ షాట్‌ తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. డాక్టర్‌ డిగ్రీని మురికి గుంటలో వేసి.. ఇలా హింసను ప్రేరేపిస్తున్నారా అంటూ రాసుకొచ్చింది. ఇలాంటి చెత్త పనులు చేయడం… పైగా వాటిని గర్వంగా భావించడం బాధగా ఉందని పోస్ట్ పెట్టింది.

హింస లేకుండా ఒక పండుగను జరుపుకోవడం అంతగొప్పగా అనిపించదు అంటూ రాసుకొచ్చింది. రష్మి గౌతమ్‌ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. చాలామంది నెటిజన్లు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఇది గర్వం కాదు.. మా సంప్రదాయం.. కోడికి లేని బాధ మీకెందుకు మేడమ్‌ అంటూ ఘాటుగా కామెంట్‌ చేశాడు. దీనిపై స్పందించిన రష్మి.. కోడికి బాధ లేదు అని మీకు తెలుసా? అంటూ ప్రశ్నించింది. మరి మనుషుల ఫైటింగ్‌ ఎందుకు పెట్టడం లేదు.. అదే చనిపోయేంత వరకు ఫైట్‌. గ్లాడియేటర్ పోరాటాలు కూడా సంప్రదాయంలో భాగమే. బహుశా మనం దాన్ని స్వీకరించి చనిపోయేంత వరకు ఫైట్‌ చేయడానికి మనుషులను దించాలి అంటూ కోడికి, మనిషికి ముడిపెట్టి గట్టి కౌంటర్ ఇచ్చేసింది.

అయినప్పటికీ పలువురు నెటిజన్లు ఆగడం లేదు. మొత్తంగా రష్మి చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

priyanka jawalkar | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా నటించను.. ప్రియాంక జవాల్కర్ సంచలన వ్యాఖ్యలు

Dil Raju Marriage | దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? ఏడాది వెంటపడి మరీ ప్రపోజ్ చేశాడా?

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Mamta Mohandas | మమతా మోహన్‌దాస్ అప్పుడు క్యాన్సర్ నుంచి కోలుకుంది.. ఇప్పుడు మరో వ్యాధి బారిన పడింది

Shweta basu prasad | కొత్త బంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది?

Exit mobile version