Home Business Microsoft Layoffs | ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వబోతున్న మైక్రోసాఫ్ట్.. 11 వేల మంది ఉద్యోగులపై...

Microsoft Layoffs | ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వబోతున్న మైక్రోసాఫ్ట్.. 11 వేల మంది ఉద్యోగులపై వేటు!

Image Source: Microsoft Wikipedia

Microsoft Layoffs | అమెజాన్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సంస్థల బాటలో మెక్రోసాఫ్ట్ నడుస్తోంది. కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతోంది. మొత్తం సిబ్బందిలో 5 శాతానికి సమానమైన ఉద్యోగులను తొలగించాడానికి ( Layoffs ) సిద్ధమైంది. బుధవారం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలన్నీ లే ఆప్స్ బాట పట్టాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఇందుకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది. మైక్రోసాఫ్ట్ లోని హ్యూమన్ రీసోర్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగుల కోతలు అధికంగా ఉంటాయని సమాచారం. మొత్తంగా 11 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

గత ఏడాది జూలైలో కొంత మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ ఇంటికి పంపింది. అక్టోబర్‌లో వెయ్యి మందికి ఉద్వాసన పలికింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో 2.21 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే రెండేళ్ల పాటు టెక్ సంస్థలు తీవ్ర గందరగోళ పరిస్థితులు ఎదుర్కోబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో ఇటీవలే ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలకు మైక్రోసాఫ్ట్ అతీతం కాదని తేల్చి చెప్పారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

America Mega Million Jackpot | అన్‌ లక్కీడే రోజే జాక్‌పాట్‌.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలుచుకున్నాడు..

New Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కారణమిదే.. భారత్‌లోనూ 26 కేసులు

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Oxfam Report | అదానీ నాలుగేళ్ల సంపాదనపై పన్ను విధిస్తే.. 50 లక్షల మంది టీచర్లకు జీతాలివ్వొచ్చట.. ఆక్స్‌ఫామ్ నివేదిక

Exit mobile version