Home Entertainment priyanka jawalkar | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా నటించను.. ప్రియాంక జవాల్కర్ సంచలన...

priyanka jawalkar | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా నటించను.. ప్రియాంక జవాల్కర్ సంచలన వ్యాఖ్యలు

priyanka jawalkar | అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్‌కు అందం ఉన్నా అదృష్టం తక్కువే అని చెప్పాలి. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో నటించిన టాక్సీవాలా చిత్రంతో క్రేజ్ వచ్చినప్పటికీ ఆఫర్లు రాలేదు. కిరణ్ అబ్బవరంతో చేసిన ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా హిట్ అయినా ఈమెను పట్టించుకున్న నాథుడే లేడు. ఆ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు కూడా లేవు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనతో సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా సరే అందులో చేయనని సంచలన వ్యాఖ్యలు చేసింది. దానికి గల కారణాన్ని కూడా వివరించింది.

Priyanka jawalkar and pawan kalyan

ప్రియాంక జవాల్కర్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ఇదివరకే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఇప్పుడు మరోసారి పవన్ గురించి చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే తనకు చచ్చేంత ఇష్టమని తెలిపింది. తమ్ముడు సినిమా 20 సార్లు చూశానని.. ఖుషీ సినిమా డైలాగులు అన్నీ ఈజీగా చెప్పేస్తానని పేర్కొంది. అంత పెద్ద స్టార్ అయినా సరే పవన్ అంత సింపుల్‌గా ఎలా ఉంటారో అర్థం కావట్లేదని తెలిపింది. ఆయన్ను దూరం నుంచి చూస్తూ అభిమానిస్తాను కానీ.. తనతో కలిసి నటించే అవకాశం వచ్చినా దానికి అంగీకరించలేను అని తెలిపింది. ఇలా దూరం నుంచి చూస్తూ ఎప్పటికీ అభిమానిస్తూనే ఉండిపోతానని స్పష్టం చేసింది. ఈ జీవితానికి ఇది సరిపోతుందని చెప్పుకొచ్చింది.

పవన్ కళ్యాణ్‌పై ఉన్న ఇష్టంతో పాటు ఇంకా చాలా విషయాలను ప్రియాంక జవాల్కర్ పంచుకుంది. అల్లు అర్జున్ నటించిన ఆర్య మూవీ అంటే తనకు ఇష్టమని తెలిపింది. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చూసి పడిపోయానని చెప్పింది. మణిరత్నం సినిమాలో ఎంత చిన్న రోల్ దక్కినా చేయాలని ఉందని తెలిపింది. సినిమాల్లోకి రాకపోయి ఉంటే పైలట్ అయ్యేదాన్ని అని చెప్పుకొచ్చింది. క్రికెటర్‌తో ప్రేమ వార్తలపై స్పందిస్తూ.. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Mamta Mohandas | మమతా మోహన్‌దాస్ అప్పుడు క్యాన్సర్ నుంచి కోలుకుంది.. ఇప్పుడు మరో వ్యాధి బారిన పడింది

Shweta basu prasad | కొత్త బంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది?

Exit mobile version