Home Latest News Heeraben modi | ప్రధాని మోదీకి మాతృ వియోగం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

Heeraben modi | ప్రధాని మోదీకి మాతృ వియోగం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

Heeraben modi | టైమ్‌ టు న్యూస్, అహ్మదాబాద్ :ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. అహ్మదాబాద్‌లోని యూఎస్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా తెలియజేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హీరాబెన్ మోదీని రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీకి తన తల్లి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రధానిగా చేపట్టిన తర్వాత ఎంత బిజీగా ఉన్నప్పటికీ జూన్ 23 (తన తల్లి జన్మదినం ), సెప్టెంబర్ 17 ( మోదీ పుట్టినరోజు)న కచ్చితంగా హీరోబెన్‌ను కలుస్తారు. హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ వచ్చిన మోదీ ఆమె పాదాలు కడిగి మిఠాయిలు తినిపించారు. ఆమెకు సేవ చేశారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 4న చివరిసారిగా తన తల్లిని మోదీ కలిశారు.ఆమెతో ఆప్యాయంగా గడిపారు.

హీరాబెన్‌కు ఐదుగురు కుమారులు.. ఒక కుమార్తె

హీరాబెన్‌ స్వస్థలం గుజరాత్‌ మోహసానాలోని విస్నానగర్. ఆమె భర్త పేరు దామోదర్‌దాస్ మోదీ. ఐదుగురు కుమారులు. ఒక కుమార్తె. మూడో సంతానంగా నరేంద్ర మోదీ జన్మించారు. పెద్ద కుమారుడు సోమ మోదీ ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైర్డ్ అధికారిగా ఉన్నారు. పంకజ్ మోదీ సమాచార శాఖలో పనిచేస్తున్నారు. అమృత్ మోదీ రిటైర్డ్ లేట్ మిషన్ ఆపరేటర్. ప్రహ్లాద్ మోదీ రేషన్ షాప్ యజమాని. కూతురు వాసంతిబెన్ అస్ముక్‌లాల్ మోదీ. తన భర్త మరణం తర్వాత హీరాబెన్‌ చివరి కుమారుడైన పంకజ్ మోదీ ఇంట్లోనే ఉంటున్నారు. 2016 మేలో ఢిల్లీలోని నరేంద్ర మోదీ అధికారిక నివాసాన్ని సందర్శించారు.

నరేంద్ర మోదీకి ప్రతివిషయంలో అండగా..

నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత తల్లి హీరాబెన్‌తో ఎక్కువ సమయం గడపడానికి కుదిరేది కాదు. 2016 మేలో ఢిల్లీలోని నరేంద్ర మోదీ అధికారిక నివాసాన్నిహీరాబెన్ సందర్శించారు. ప్రతిసారి మోదీనే గాంధీనగర్ వచ్చి తన తల్లి ఆశీస్సులు తీసుకునేవారు. ఇక హీరాబెన్ కూడా తన కొడుక్కి ప్రతి విషయంలో అండగా నిలబడేది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు తన కుమారుడు మోదీకి హీరాబెన్ మద్దతు తెలిపారు. ఏటీఎం క్యూలైన్‌లో0 నిలబడి అందర్నీ ఆకర్షించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడికి ఓటు వేయాలని హీరాబెన్ ప్రచారం చేశారు. 99 ఏళ్ల వయసులో సైతం ఓటు వేశారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Follow Us : FacebookTwitter

Read More Articles |

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Exit mobile version