Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (29-12-2022 )

Horoscope Today | రాశిఫలాలు (29-12-2022 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

వృషభం

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త మిత్రులుకలిసి సాయం అందిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

మిథునం

రుణాలను కొంతవరకు తీరుస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు.

కర్కాటకం

శ్రమ అధికం. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ఆకస్మిక బదిలీలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

సింహం

నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలకు దారితీస్తాయి.

కన్య

సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా చికాకులు తెప్పించినా అధిగమిస్తారు. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభ సూచన ఉంది.

తుల

నూతన మిత్రులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వాహన, భూ యోగాలు పొందుతారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు.వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శుభవార్తలు వింటారు.

వృశ్చికం

దూర ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. బాధ్యత పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు

పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

మకరం

సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే సూచన ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. విద్య, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. భూ యోగాన్ని పొందుతారు.

కుంభం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ధన లాభ సూచన ఉంది.

మీనం

ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆహ్వానాలు అందుకుంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Exit mobile version