Home News International Pele | సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత.. క్యాన్సర్‌తో చివరివరకు పోరాడి..

Pele | సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత.. క్యాన్సర్‌తో చివరివరకు పోరాడి..

Image Source : Twitter

Pele | ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బ్రెజిల్‌ సావోపాలో ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు ఆయన కూతురు ధ్రువీకరించారు. క్యాన్సర్ బారిన పడ్డ పీలేకు గత ఏడాది సెప్టెంబర్‌లో ఆపరేషన్ చేసి పెద్ద పేగు క్యాన్సర్ కణతిని తొలగించారు. అప్పట్నుంచి పీలేకు కీమోథెరపీ అందిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఆరోగ్యం క్షీణించడంతో అవయవాలు పనిచేయడం మానేశాయి. తాజాగా పరిస్థితి మరింత విషమించడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పీలే మరణవార్త తెలిసి దేశాధినేతలు, క్రీడాకారులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

మూడు సార్లు ప్రపంచకప్ అందించిన ఆటగాడు

1940 అక్టోబర్ 24న జన్మించారు. తన 16వ ఏటనే బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లోకి అరంగేట్రం చేశాడు. రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు.21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో పీలే 1363 ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడాడు. 1281 గోల్స్ సాధించి.. ఈ ఘనత సాధించి తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఫుట్‌బాల్ చరిత్రలో మూడు వరల్డ్‌కప్ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడు కూడా పీలేనే. నాలుగు ప్రపంచకప్‌ల్లో బ్రెజిల్ దేశానికి పీలే ప్రాతినిథ్యం వహించాడు. 1958, 1962, 1970లో వరల్డ్‌కప్ అందుకున్నాడు. ఆరుసార్లు బ్రెజిలియన్ క్లబ్ శాంటోస్‌కు బ్రెజిల్ లీగ్ టైటిల్‌ను అందించాడు. శతాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా 2000వ సంవత్సరంలో పీలేను ఫిఫా ప్రకటించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Heeraben modi | ప్రధాని మోదీకి మాతృ వియోగం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Exit mobile version