Ganga vilas | ప్రపంచంలోనే అత్యంత పొడువైన క్రూయిజ్ సర్వీస్ ఎంవీ గంగా విలాస్ ( Ganga Vilas )ను ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో పాటు గంగానది పక్కన అభివృద్ధి చేసిన టెంట్ సిటీ ( Tent City )ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్‌లో కొత్తతరం పర్యాటానికి ఇది నాంది పలుకుతుందని తెలిపారు. దీనివల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. దేశంలో ఇటువంటి మరిన్ని పర్యాటక నౌకలు రాబోతున్నాయని పేర్కొ్న్నారు.

స్విట్జర్లాండ్ పర్యాటకులతో తొలి ప్రయాణం
భారత్‌లో తయారైన ఈ తొలి క్రూయిజ్ గంగా విలాస్ ( Ganga Vilas )లో ప్రపంచంలోనే అత్యంత పొడువైన క్రూయిజ్. 18 సూట్లు ఉండే ఈ నౌకలో 36 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు. దీనిలో మూడు డెక్‌లు కలవు. ఇందులో రెస్టారెంట్, స్పా, సన్‌డెక్ కూడా ఏర్పాటు చేశారు. అప్పర్ డెక్‌లో ఓ బార్ కూడా ఉంటుంది. నిజానికి ఈ క్రూయిజ్ సర్వీస్ 2020లోనే ప్రారంభం కావాల్సింది. కానీ కొవిడ్ కారణంగా ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులు ఈ క్రూయిజ్‌లో మొదటి ప్రయాణాన్ని చేస్తున్నారు.

బంగ్లాదేశ్ జలాల మీదుగా వెళ్తూ 50 పర్యాటక ప్రాంతాలు చూడొచ్చు
గంగా విలాస్ తొలి ప్రయాణం వారణాసి నుంచి మొదలై అసోంలోని దిబ్రూగఢ్ వరకు కొనసాగనుంది. 51 రోజుల పాటు 3200 కిలోమీటర్లు ఈ ప్రయాణం సాగనుంది. గంగానదితో పాటు 27 ఉపనదుల మీదుగా ఈ క్రూయిజ్ వెళ్లనుంది. బంగ్లాదేశ్ జలాల్లో కూడా ఈ క్రూయిజ్ ప్రయాణించనుంది. మొదట వారణాసి నుంచి 8 రోజుల్లో పట్నాకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 20 రోజుల్లో బక్సర్, రామ్‌నగర్, ఘాజీపూర్, ముర్షీదాబాద్ మీదుగా కోల్‌కతాకు వెళ్లనుంది.

కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోకి ఎంటర్ అవుతుంది. బంగ్లా నదుల్లో 15 రోజుల పాటు ప్రయాణించి.. గౌహతి వద్ద భారత జలాల్లోకి వస్తుంది. అక్కడి నుంచి ఒడిశాలోని దిబ్రూగఢ్ చేరుకుంటుంది. ఈ సమయంలో గంగా హారతి, విక్రమశిల యూనివర్సిటీ, సుందర్బన్ డెల్టా, కజీరంగా నేషనల్ పార్కు సహా 50 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించుకోవచ్చు. ఈ ప్రయాణంలో ఒక్కొక్కరికి రోజుకు రూ.25వేల నుంచి రూ.50వేల ఖర్చవుతుందని అంచనా. అంటే మొత్తంగా 51 రోజుల ప్రయాణానికి సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?