Tuesday, April 16, 2024
- Advertisment -
HomeNewsAPPawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ...

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత అంటూ ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్నది మూడు ముక్కల ప్రభుత్వమని, తను మూడు ముక్కల సీఎం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి నన్ను మాటమాటకి మూడు పెళ్లిళ్లు అంటున్నారని వ్యాఖ్యానించారు. తాను ముగ్గురికీ విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నా అని పేర్కొన్నారు. మీ నాన్న వైఎస్‌నే ఎదుర్కొన్నా నువ్వెంత అంటూ ధ్వజమెత్తారు. పంచెలూడదీసి కొడతానని అప్పట్లోనే సవాల్‌ చేశానని అన్నారు. తాను అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. చిన్న వయసులోనే తీవ్రవాదం వైపు వెళ్లాలనుకుని ఆగిపోయానని అన్నారు. ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతా అని గతంలోనే చెప్పానని అన్నారు. తన చేతికి అందుబాటులోకి వచ్చి ఎవడైనా ప్యాకేజీ అంటే ఏం చేస్తానో నాకే తెల్వదు అంటూ తీవ్ర స్థాయిలో పవన్‌ కళ్యాణ్‌ విరుచుకుపడ్డారు.

సంబరాల రాంబాబూ పిచ్చి కూతలు ఆపండి అంటూ ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి విమర్శించారు. తాను బతికున్నంత వరకూ యుద్ధం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కులం మద్దతివ్వకపోయినా కులాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలనుకోవట్లేదు అని తేల్చి చెప్పారు. ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అంటూ ప్రకటించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

varisu vs thunivu | ఇదేం అరాచకం.. చెన్నైలో థియేటర్ ముందే తన్నుకున్న విజయ్, అజిత్ ఫ్యాన్స్

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News