Home Latest News Heeraben | సామాన్యురాలే కానీ.. శక్తిమంతురాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం

Heeraben | సామాన్యురాలే కానీ.. శక్తిమంతురాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం

Image Source : Twitter

Heeraben | టైమ్ టు న్యూస్, న్యూఢిల్లీ : తన తల్లి హీరాబెన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి మరణవార్తను ట్విట్టర్ ద్వారా తెలియజేసిన మోదీ.. ఎమోషనల్ అయ్యారు. ‘ నా తల్లి నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని దేవుడి వద్దకు వెళ్లిపోయింది. ఆమె జీవితం ఓ తపస్సు లాంటిది. ఒక సన్యాసిలా, కర్మ యోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపింది. ఆమెలో త్రిమూర్తులు ఉన్నారని భావిస్తున్నా’ అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ ఈ ఏడాది జూన్ 23న తన వందో పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమె పాదాలు కడిగి మిఠాయిలు తినిపించారు. ఆమెకు సేవ చేశారు. ఆ సమయంలోనే తన తల్లి హీరాబెన్ గురించి చాలా విషయాలను తన బ్లాగులో మోదీ పంచుకున్నారు. ఆ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

వందో పుట్టిన రోజు సందర్భంగా మోదీ ఏం చెప్పారంటే..

” అమ్మ 100వ పుట్టిన రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తన చుట్టూ ఉండేవాళ్లు సంతోషంగా ఉండాలని అమ్మ కోరుకునేది. మా ఇల్లు చిన్నదే కావచ్చు.. కానీ అమ్మ మనసు మాత్రం చాలా విశాలమైనది. నాలో ఉన్న మంచితనం అంతా మొత్తం మా అమ్మానాన్నల నుంచి వచ్చిందే. మా అమ్మ సామాన్యురాలే కావచ్చు.. కానీ చాలా శక్తిమంతురాలు. గుజరాత్‌లోని మొహసానా జిల్లా విస్నానగర్‌లో అమ్మ జన్మించింది. ఆమె పుట్టిన కొద్దిరోజులకే అమ్మమ్మ చనిపోయింది. తల్లి లేకుండానే ఆమె బాల్యమంతా గడిచిపోయింది. తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకునే అదృష్టం మా అమ్మకు దక్కలేదు. అమ్మకు ఉత్తరాలు అంటే తెలియదు. కనీసం స్కూల్ గేట్ కూడా ఆమె ఎప్పుడూ చూడలేదు. ఆమె చూసింది ఒక్క పేదరికమే. వాద్నానగర్‌లో మేం ఉండే ఇల్లు చాలా చిన్నగా ఉండేది. ఆ ఇంటికి ఒక్కటే కిటికీ. టాయిలెట్స్ లేవు. ఆ చిన్న ఇంట్లోనే మేమంతా ఉండేవాళ్లం. నాన్న తెల్లవారుజామున 4 గంటలకే పనికి వెళ్లేవాడు. అమ్మ కూడా అదే టైమ్‌కి లేచి.. వేరే వాళ్ల ఇళ్లలో పనికి వెళ్లేది. పొలం పనులకు వెళ్లేది. నేను ఇంటికి వస్తే ఇప్పుడు కూడా స్వీట్లు తినిపిస్తుంది. చిన్న పిల్లాడికి తుడిచినట్టు మూతి తుడుస్తుంది. గుజరాతీలు నువ్వు అనాలంటే తు అని అంటారు. మీరు అనాలంటే తమే అని పిలుస్తారు. నేను ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు తు అనే పిలిచేది. కానీ ఇల్లు విడిచా ప్రజా జీవితంలోకి వచ్చాక పిలుపు మారింది. నన్ను తమే అని మాత్రమే పిలుస్తుంది.” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆనాడు భావోద్వేగానికి గురయ్యారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Heeraben modi | ప్రధాని మోదీకి మాతృ వియోగం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

Pele | సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత.. క్యాన్సర్‌తో చివరివరకు పోరాడి..

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Exit mobile version