Home Latest News Omicron BF.7 | చైనాలో కరోనా కల్లోలానికి ఒక్కటి కాదు 4 వేరియంట్లు కారణం.. అందుకే...

Omicron BF.7 | చైనాలో కరోనా కల్లోలానికి ఒక్కటి కాదు 4 వేరియంట్లు కారణం.. అందుకే లక్షణాల్లో తేడాలు!

Omicron BF.7 | చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 అని, అత్యంత వేగంగా వ్యాపిస్తోదని, ఫలితంగా రోజూవారీగా కోట్లల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అందరూ అనుకున్నారు. అయితే చైనాలో కరోనా కేసులు భారీగా పెరగడానికి బీఎఫ్.7 వేరియంట్ ఒకటే కారణం కాదని, నాలుగు వేరియంట్లు కారణమని భారత ప్రభుత్వ కొవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్‌కే అరోరో చెప్పారు.

భారత్‌లో చైనాలాంటి పరిస్థితి మాత్రం ఎదురుకాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చైనాలో బీఎఫ్.7 వేరియంట్ కేసులు కేవలం 15 శాతమే అని తెలిపారు. బీఎన్, బీక్యూ వేరియంట్ల నుంచి 50 శాతం కేసులు వస్తున్నాయని, ఎస్‌వీవీ వేరియంట్ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. అందుకే అందరిలో ఒకేరకమైన లక్షణాలు లేవని, భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని అరోరా పేర్కొన్నారు.

భారత్‌లో 97 శాతం జనాభా కరోనా వ్యాక్సిన్లు వేసుకోవడం, కరోనా మూడు వేవ్‌ల వల్ల చాలా మంది కరోనా బారిన పడటంతో ఇప్పటికే హైబ్రీడ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని అరోరా అన్నారు. కాబట్టి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చైనాలో జీరో కోవిడ్ ఆంక్షలు.. గతంలో ఈ స్థాయిలో కరోనా విజృంభన లేకపోవడంతో చాలా తక్కువ మందికే కరోనా ఇన్‌ఫెక్షన్ సోకిందన్నారు. పైగా చైనాలో ఇచ్చిన అంతగా ప్రభావవంతమైనవి కాకపోవడంతోనే ప్రస్తుతం భారీగా కేసులు నమోదయ్యేందుకు కారణమని అన్నారు. అందుకే చైనా వాళ్లతో పోలిస్తే భారత ప్రజలు చాలా వరకు సేఫ్ జోన్‌లోనే ఉన్నారని అరోరా వివరించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

Omicron BF.7 | అక్కడ.. ఒమిక్రాన్ బీఎఫ్. 7 బాధితులకు రూపాయి ఖర్చు లేకుండా చికిత్స

Corona nasal spray | నాజల్ స్ప్రే వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్.. ప్రైవేటు ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్ కోసం అంత చెల్లించాల్సిందే

Prabhas | 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. కారణం అదేనా?

Exit mobile version