Home Latest News Omicron BF.7 | అక్కడ.. ఒమిక్రాన్ బీఎఫ్. 7 బాధితులకు రూపాయి ఖర్చు లేకుండా చికిత్స

Omicron BF.7 | అక్కడ.. ఒమిక్రాన్ బీఎఫ్. 7 బాధితులకు రూపాయి ఖర్చు లేకుండా చికిత్స

Omicron BF.7 | చైనా సహా ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కే చైనా ఆస్పత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. శ్మశాన వాటికల వద్ద కూడా మృతదేహాలు క్యూలో ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరుచుకోవాలని, ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, వెంటిలేటర్లు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. అంతర్జాతీయ ప్రయాణీకులకు కరోనా టెస్టులు కంపల్సరీ చేసింది. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చిన పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ పంపించారు. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరింత అప్రమత్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 సోకిన వారికి రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి ఆర్ అశోక అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కేవలం బీఎఫ్.7 వేరియంట్ సోకిన బాధితుల కోసమే ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులు కేటాయించినట్లు తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్‌లాక్ ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స అందించనున్నట్లు చెప్పారు.

మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే కఠిన ఆంక్షలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆదేశించింది. కొత్త సంవత్సర వేడుకలపైనా ఆంక్షలు విడుదల చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకే వేడుకలకు అనుమతి ఉందని వెల్లడించింది. వేడుకల్లో మాస్కులు కూడా తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Waltair Veerayya | దుమ్మురేపుతున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్..మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Prabhas | 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. కారణం అదేనా?

Corona | చైనాలోని ఆ ఒక్క నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా కరోనా కేసులు.. చేతులెత్తేసిన అధికారులు

Sushant singh rajput | సుశాంత్‌ సింగ్‌ది హత్యనే.. పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version