Home Lifestyle Do you know World Idli Day | ఇడ్లీలకు ఒక రోజు ఉందని తెలుసా? ఆటో డ్రైవర్‌ బర్త్‌...

World Idli Day | ఇడ్లీలకు ఒక రోజు ఉందని తెలుసా? ఆటో డ్రైవర్‌ బర్త్‌ డే.. వరల్డ్‌ ఇడ్లీ డేగా ఎలా మారింది?

World Idli Day | డైట్‌ పాటించే వాళ్లు కూడా ఇష్టంగా తినే ఫుడ్‌ ఇడ్లీ! నూనె లేకుండా జీరో కొలెస్ట్రాల్‌తో చేసిన ఇడ్లీని తినేందుకు చిన్నాపెద్దా అందరూ ఇష్టపడతారు. కొందరు అల్లం చట్నీతో తింటే.. మరికొందరు పల్లి చట్నీలో నంజుకుంటారు.. ఇంకొందరైతే సాంబార్‌తో జుర్రేస్తారు. కాంబినేషన్‌ ఏదైనా సరే పొద్దున్నే టిఫిన్‌లో ఇడ్లీ ఉండాల్సిందే. భోజనప్రియులకు అంత ఫేవరేట్‌ కాబట్టే ఇడ్లీ కోసం ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించారు. ఏటా మార్చి 30న ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మరి అసలు ఇడ్లీ కోసం ఎందుకు ఒక రోజును కేటాయించారు? ఎందుకు జరుపుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కోయంబత్తూర్‌కు చెందిన ఇనియవాన్ ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేశాడు. బతుకుతెరువు కోసం హోటళ్లలో కప్పులు కడిగాడు, టేబుళ్లు తుడిచాడు. ఆ తర్వాత ఆటో నడుపుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఆటోలో రోజూ చంద్రమ్మ అనే ఒకావిడ ఎక్కేది. చంద్రమ్మ ఇంటి దగ్గర ఇడ్లీలు తయారు చేసి వాటిని చుట్టుపక్కల అమ్ముకోవడానికి ఇనియవాన్‌ ఆటో ఎక్కి వెళ్లేది. అలా రోజూ ఇనియవాన్‌ ఆటోలోనే చంద్రమ్మ ప్రయాణించడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ ప్రయాణంలో ఇడ్లీల తయారీ గురించి చంద్రమ్మ దగ్గర ఇనియవాన్‌ తెలుసుకున్నాడు. వాటిని తిన్న తర్వాత కస్టమర్స్‌ ఇచ్చే రియాక్షన్స్‌ను కూడా చంద్రమ్మ పంచుకుంది. అవన్నీ విన్న తర్వాత తను కూడా ఓ ఇడ్లీ హోటల్ పెడితే బాగుంటుందని కదా అని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆటో నడపడం మానేసి కోయంబత్తూర్‌ నుంచి చెన్నై వెళ్లిపోయాడు. ఓ పాత పాకలో మల్లిపూ ఇడ్లీ పేరుతో హోటల్‌ తెరిచాడు. కానీ ఇనియవాన్ హోటల్ ప్రారంభించిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి. పాకలోంచి నీరు కారడంతో సరకులూ ఇడ్లీ పిండీ అన్నీ తడిసిపోయాయి. అయినా ఇనియవాన్‌ ఏ మాత్రం నిరుత్సాహపడలేదు. వర్షాలు తగ్గిన తర్వాత మళ్లీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాడు.

ఆటో డ్రైవర్‌ నుంచి ఇడ్లీమ్యాన్‌గా..

అందరూ ఇడ్లీలు చేస్తారు. మరి వాళ్లతో తనకు వ్యత్యాసం ఎలా ఉండాలి? ఎలా ప్రత్యేకంగా కనిపించాలని ఇనియవాన్‌ రోజూ ఆలోచించేవాడు. అందుకే రెగ్యులర్‌గా కాకుండా వెరైటీ ఇడ్లీలు తయారు చేయాలని అనుకున్నాడు. అందుకే కొత్త కొత్త రుచుల్లో ఇడ్లీల తయారీ మొదలు పెట్టాడు. లేత కొబ్బరి, చాకొలెట్, బాదం, నారింజ, మొక్కజొన్న పిండి… వంటి రకరకాల పదార్థాలను ఇడ్లీ పిండిలో కలిపి వెరైటీగా తయారు చేసేవాడు. అవన్నీ కూడా కస్టమర్స్‌కు విపరీతంగా నచ్చేశాయి. దీంతో ఇనియవాన్‌ హోటల్‌కు గిరాకీ బాగా పెరిగింది. అప్పట్నుంచి వెనక్కి చూసుకోలేదు. ఇప్పటివరకు ఇనియవాన్‌ రెండు వేల రకాల ఇడ్లీలను సృష్టించాడు. వాటిలో 20కి పైగా ఇడ్లీ వెరైటీలకు పేటెట్‌ కూడా రావడం గమనార్హం. ఇలా వెరైటీలు సృష్టించడంతో ఇనియవాన్‌ ఇప్పుడు ఇడ్లీమ్యాన్‌గా మారిపోయాడు. అతను వండిన 125కిలోల ఇడ్లీ గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. ప్రస్తుతం మల్లిపూ ఇడ్లీ సంస్థ 30 రుచుల్లో హోల్‌సేల్‌గా ఇడ్లీలను అమ్ముతున్నది.

ఇనియవాన్‌ బర్త్‌ డేనే ఇడ్లీ డే

ఇడ్లీ తయారీలో ఇనియవాన్‌ చాలా ప్రత్యేకత చూపించారు. రెండు వేలకు పైగా వెరైటీలతో ఇడ్లీలను తయారు చేశాడు. ఎవరూ తయారు చేయలేని రకాల్లో కూడా ఇడ్లీలను రూపొందించాడు. గణపతి, మిక్కీ మౌస్‌, కుంగ్‌ఫూ పాండా వంటి ఆకృతుల్లో కూడా ఇడ్లీలను తయారు చేసి అందర్నీ ఆకర్షించాడు. ఇడ్లీల తయారీలో ఇనియవాన్‌ చేస్తున్న కృషిని గుర్తించిన తమిళనాడు కుకింగ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 2015లో ఇనియవాన్‌ పుట్టిన రోజు అయిన మార్చి 30ని వరల్డ్‌ ఇడ్లీ డేగా ప్రకటించింది. అప్పట్నుంచి మార్చి 30న ఘనంగా ప్రపంచ ఇడ్లీ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

Exit mobile version