Home Entertainment Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ గ్రేట్ తమిళ సినిమా.. సోషల్‌మీడియాలో ప్రియాంక చోప్రాను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ గ్రేట్ తమిళ సినిమా.. సోషల్‌మీడియాలో ప్రియాంక చోప్రాను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Priyanka Chopra | రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలోనే కాదు ఖండాంతరాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. ఈ పాటకు రీల్స్ చేస్తూ, స్టెప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అంతలా అందరికీ నచ్చింది కాబట్టే నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ వేదిక దాకా తీసుకెళ్లిన ఈ చిత్రాన్ని విదేశాల్లోని చాలామంది బాలీవుడ్ సినిమా అని పొరబడ్డారు. వాళ్లందరికీ ఇది తెలుగు సినిమా అని మనవాళ్లు చెప్పుకొస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు విదేశీయులు కాదు.. మన ఇండియన్ నటి కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను తెలుగు సినిమాగా గుర్తించలేదు. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా? ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.

ఇటీవల ఒక పొడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూకి వెళ్లిన ప్రియాంక చోప్రాకు బాలీవుడ్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ రాజకీయాల గురించి ఆమె స్పందించారు. హిందీ చలన చిత్ర పరిశ్రమ తనను ఒక మూలకు నెట్టేసిందని.. పలువురితో విభేదాల కారణంగా తనకు ఎవరూ సరిగ్గా అవకాశాలు ఇచ్చే వారు కాదని బయటపెట్టింది. అక్కడి రాజకీయాలతో విసిగిపోయే బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని అమెరికాకు వచ్చేశానని అసలు విషయం చెప్పింది. బాలీవుడ్ పరిశ్రమ కొంతమంది చేతుల్లోనే ఉందని చెప్పింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుంచి మార్పు వస్తుందని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను వ్యాఖ్యత డాక్స్ షెఫర్డ్ ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాను డాక్స్ షెఫర్డ్ బాలీవుడ్ సినిమా అనుకోని ఈ పొరపాటు చేశాడు. అయితే వ్యాఖ్యాత చేసిన తప్పును సరిదిద్దబోయి ప్రియాంక చోప్రా కూడా పప్పులో కాలేసింది.

ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదని క్లారిటీ ఇస్తూనే.. ఆర్ఆర్ఆర్ గ్రేట్ సినిమా.. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ అని చెప్పుకొచ్చింది. అది మనందరికీ అవెంజర్స్ అని ప్రశంసించింది. ఈ ఇంటర్వ్యూ చేసిన తెలుగు సినీ అభిమానులు ప్రియాంక చోప్రాపై సీరియస్ అవుతున్నారు. విదేశీయులకు అంటే తెలియదు.. బాలీవుడ్ మూవీ అని అనుకున్నారు.. ఇప్పుడు నువ్వు కూడానా అంటూ ప్రియాంకపై ఫైర్ అవుతున్నారు. మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా అని సలహాలు ఇస్తున్నారు. ఇక కొంతమంది అయితే హద్దులు దాటి మరీ కామెంట్లు పెడుతున్నారు. ఆర్ఆర్ఆర్ తమిళ సినిమానా? కళ్లు పోయాయా? లేక అమెరికా వెళ్లాక కనిపించడం లేదా? అని మండిపడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఇది దుమారమే రేపుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

World Idli Day | ఇడ్లీలకు ఒక రోజు ఉందని తెలుసా? ఆటో డ్రైవర్‌ బర్త్‌ డే.. వరల్డ్‌ ఇడ్లీ డేగా ఎలా మారింది?

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

Telangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి

Exit mobile version