Home News International New Zealand PM | న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం.. రాజీనామా...

New Zealand PM | న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

Image Source: Jacinda Ardern Facebook

New Zealand PM | న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. తన రాజీనామాకు ఇదే సరైన సమమయని భావించి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. జెసిండా అనూహ్య నిర్ణయంతో ఆ దేశ ప్రజలు షాక్‌కు గురయ్యారు. 2017లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న జెసిండా 2019లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయతీరాలకు చేర్చి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

2019లో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో మసీదుపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో జెసిండా వ్యవహరించిన తీరు ప్రపంచదేశాల ప్రశంసలు అందుకుంది. కరోనా సమయంలో, ప్రకృతి విపత్తుల సమయంలోను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత ఉన్నతమైనదని అంటూనే సవాళ్లతో కూడుకున్నదని రాజీనామా సమయంలో జెసిండా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తి స్థాయిలో లేనప్పుడు పదవిలో కొనసాగలేమని స్పష్టం చేశారు. తాను ఒక మనిషినేనని, వీలైనంత వరకు చేయగలమని, తర్వాత సమయం వస్తుందని, ఇప్పుడా సమయం వచ్చిందని అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దేశానికి నాయకత్వం వహించడం ఎంత ముఖ్యమో.. నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తా ? కాదా అనేది తెలుసుకోవడం కూడా అంతే బాధ్యత అని అన్నారు. తన రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదని జెసిండా స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది అక్టోబరు 14న న్యూజిలాండ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జెసిండా రాజీనామా నేపథ్యంలో ఈనెల 22న కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

Exit mobile version