Home Entertainment Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ...

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

Tamannah Bhatia | మిల్కీబ్యూటీ తమన్నా ఈమధ్య తరచూ వార్తల్లో కనిపిస్తుంది. మూడు పదుల వయసు దాటడంతో తమన్నా పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు జోరుగా వినిపించాయి. కానీ అవన్నీ వదంతులేనని తమన్నా కొట్టిపారేసింది. దీంతో ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా వీళ్లిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కానీ బీటౌన్‌లో జరుగుతున్న ప్రచారంపై మాత్రం తమన్నా స్పందించలేదు. కాకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా రొమాంటిక్ సీన్స్‌లో నటించడం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటే హీరోయిన్లు ఎక్కువగా ఇబ్బంది పడతారని మనం అనుకుంటాం.. చాలామంది హీరోయిన్లు కూడా ఇదే విషయం గురించి గతంలో చెప్పుకొచ్చారు. బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడాల్సిందంటూ తమ బాధను చెప్పుకొన్నారు. కానీ అలాంటి సీన్స్‌లో నటించాలంటే హీరోయిన్ల కంటే హీరోలకే ఎక్కువ వణుకు పుడుతుందని తమన్నా చెబుతోంది. చాలామంది హీరోల దగ్గర ఈ విషయాన్ని గమనించానని తన ఎక్స్‌పీరియన్స్‌ను వివరించింది. అమ్మాయిలతో అలా నటిస్తున్నామనే ఫీలింగ్ వల్లే వాళ్లకు దడ పుడుతుందేమో అంటే తన అభిప్రాయాన్ని తెలిపింది.

అప్పుడెప్పుడో 2005లో వచ్చిన శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా. హ్యాపీడేస్ సినిమాతో తొలిసారి సక్సెస్ అందుకుంది. అప్పట్నుంచి పలు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ తన డ్యాన్సులతో ఇరగదీసింది. సీనియర్ హీరో చిరంజీవితో కూడా ఈమె జతకట్టింది. ప్రస్తుతం తమన్నా చిరంజీవితో భోళా శంకర్‌తో పాటు హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

Rashmi Gautam | కోడికి లేని బాధ నీకెందుకు.. నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన రష్మి

priyanka jawalkar | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా నటించను.. ప్రియాంక జవాల్కర్ సంచలన వ్యాఖ్యలు

Dil Raju Marriage | దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? ఏడాది వెంటపడి మరీ ప్రపోజ్ చేశాడా?

Exit mobile version