Home Latest News PM Kisan | పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో పడేది అప్పుడే.. eKYCకి రేపే...

PM Kisan | పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో పడేది అప్పుడే.. eKYCకి రేపే లాస్ట్‌ డేట్‌

PM Kisan | పీఎం కిసాన్‌ సమ్మాన్‌ కింద త్వరలోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ముందుగా జనవరి 23వ తేదీన ఈ డబ్బులు పడతాయని వార్తలు వచ్చాయి. దీంతో ఆ రోజు డబ్బులు పడతాయని రైతులు ఎంతగానో ఆశపెట్టుకున్నారు. కానీ వాళ్లకు నిరాశే ఎదురైంది. దానిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న తాజా సమాచారం ప్రకారం మార్చి 8వ తేదీలోపు అంటే హోలీ పండుగ కంటే ముందే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు తీసుకొచ్చినట్టే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 2019లో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ సాయాన్ని మూడు విడతల్లో 2వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు 12 విడతల్లో రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇప్పుడు 13వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడి సాయాన్ని రూ.6వేల నుంచి రూ.8వేలకు పెంచుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే కేంద్రానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ స్పష్టం చేశారు.

ఇక 12వ విడతలో చాలామంది రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దీనికి వాళ్లు కేవైసీ పూర్తి చేయకపోవడమే కారణం. కేవైసీ పూర్తి చేయకపోతే వాళ్లకు ఈ సారి కూడా పీఎం కిసాన్‌ డబ్బులు పడే అవకాశం ఉండదు. కాబట్టి ఫిబ్రవరి 10లోపు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈకేవైసీ ఎలా చేయాలంటే..

  • ముందుగా పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ www.pmkisan.gov.in ఓపెన్‌ చేసి ఈకేవైసీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఈకేవైసీ మీద క్లిక్‌ చేసిన తర్వాత ఆధార్‌ కార్డు నంబర్ ఎంటర్‌ చేసి సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • అప్పుడు స్క్రీన్‌పై ఎంటర్‌ మొబైల్‌ నంబర్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. అప్పుడు మీ మొబైల్‌ నంబర్ ఎంటర్‌ చేసి గెట్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత ఆధార్ రిజిస్టర్డ్‌ ఓటీపీ అనే ఆప్షన్‌ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేస్తే సరిపోతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.. కౌ హగ్‌ డేనట.. అందరూ ఇలా చేయాలన్న పశుసంవర్ధక శాఖ!

Narendra Modi | దేశం కోసమే నా జీవితం అంకితం చేశా.. కాంగ్రెస్‌ వల్ల దశాబ్ద కాలాన్ని కోల్పోయాం.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌!

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

Border Gavaskar Trophy | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ.. ఆసీస్‌తో తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌కు షాకిచ్చిన రవిశాస్త్రి

RBI Repo Rate | సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు

Exit mobile version