Home Latest News Border Gavaskar Trophy | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ.. ఆసీస్‌తో తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌కు...

Border Gavaskar Trophy | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ.. ఆసీస్‌తో తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌కు షాకిచ్చిన రవిశాస్త్రి

Border Gavaskar Trophy | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి అంతా సిద్దమైంది. టీమిండియా, ఆస్ట్రేలియా ( IND vs AUS ) పోరుకు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం ముస్తాబవుతోంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9న ఉదయం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్స్‌లో చోటు దక్కించుకోవాలంటే ఈ టెస్ట్‌ సిరీస్‌ గెలవడం ఎంతో కీలకం. దీంతో ఆస్ట్రేలియాతో తలపడబోయే తుది జట్లు ఎవరెవరు ఉంటారది క్రికెట్‌ అభిమానుల్లో ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ( Ravi Shastri ) తన ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఐసీసీ రివ్యూ సందర్భంగా ఫస్ట్‌ టెస్టులో టీమిండియా జట్టు ఎలా ఉండబోతుందనే తన అంచనాను వెల్లడించాడు.

రవి శాస్త్రి ప్రకటించిన 11 మంది ప్లేయర్ల జాబితా చాలావరకు క్రికెట్‌ అభిమానులు ఊహించినట్టుగానే ఉన్నాయి. కాకపోతే రెండు మూడు ప్రతిపాదనలు మాత్రం అనూహ్యంగా ఉన్నాయి. ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆఖరి నిమిషంలో కెప్టెన్‌, కోచ్‌ దీనిపై ఓ నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ మధ్య దూకుడు చూపిస్తున్న సూర్య కుమార్‌ యాదవ్‌ను ఐదో స్థానంలో తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక తన జట్టులో రవి శాస్త్రి ముగ్గురు స్పిన్నర్లకు చోటు కల్పించాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. అక్షర్‌ పటేల్‌ను కాదని కుల్దీప్‌ యాదవ్‌కు రవిశాస్త్రి మొగ్గుచూపడం క్రికెట్‌ అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. ఇక వికెట్‌ కీపర్‌గా శ్రీకర్‌ భరత్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌ అయినా బాగానే ఉంటాడని ఎంచుకున్నాడు. ఇవి కాకుండా మిగిలిన ప్రతిపాదలను అన్నీ అందరూ ఊహించినట్టుగానే ఉన్నాయి.

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి మరో ప్రిడిక్షన్‌ కూడా రవిశాస్త్రి చేశాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌ను 4-0 తేడాతో టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అంచనా వేశాడు. కీలకమైన ఓపెనింగ్‌ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని.. దీంతో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం చాలా సులువైన పని అని అన్నారు.

రవి శాస్త్రి ఎంచుకున్న జట్టు ఇదే..

  1. రోహిత్‌ శర్మ (కెప్టెన్‌)
  2. శుభ్‌మన్‌ గిల్‌/ కేఎల్‌ రాహుల్‌
  3. ఛటేశ్వర్‌ పుజారా
  4. విరాట్‌ కోహ్లీ
  5. సూర్యకుమార్‌ యాదవ్‌
  6. కేఎస్‌ భరత్‌/ఇషాన్‌ కిషన్ (వికెట్‌ కీపర్
  7. రవీంద్ర జడేజా
  8. రవిచంద్రన్ అశ్విన్‌
  9. కుల్దీప్‌ యాదవ్‌
  10. మహమ్మద్‌ సిరాజ్‌
  11. మహమ్మద్‌ షమీ

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rahul Dravid on Border Gavaskar Trophy| టెస్టు క్రికెట్‌లో అదే ముఖ్యం.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

Vinod Kambli | క్రికెటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వినోద్‌ కాంబ్లీ

Suresh Raina | ఆసీస్‌ నిర్ణయం ఆశ్చర్యపరిచింది: సురేశ్‌ రైనా

Cricket Australia | అశ్విన్‌ ‘డూప్‌’ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రాక్టీస్‌.. ఎందుకిలా ?

Afridi Marriage | ఒక ఇంటివాడైన అఫ్రిది.. దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురితో ‘నిఖా’

Exit mobile version