Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (10-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (10-02-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

శుభవార్తలు వింటారు. మీ వైఖరిలో మార్పులు వస్తాయి. అనాలోచితంగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అధికంగా శ్రమిస్తారు. వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించడం మంచిది.

వృషభం

సహోదర, సహోదరి వర్గంతో కలిసి ఇష్టాగోష్టిని సాగిస్తారు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. దైవ చింత కలిగి ఉంటారు.

మిథునం

డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో జాగ్రత్తలు అవసరం. అనుకూలమైన ఉత్తర్వులు చేతికందుతాయి. సమిష్టి నిర్ణయాలు లాభించవు. దీర్ఘాలోచనలు మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి.

కర్కాటకం

పుస్తక పఠనం సాగిస్తారు. నిష్కారణంగా నిందారోపణలకు గురిచేస్తున్న వారిని గుర్తిస్తారు. ఉపకరించే అవకాశాలు లబిస్తాయి. చిన్నపాటి వస్తువులను కొనుగోలు చేస్తారు. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

సింహం

బహుమతులు అందుకుంటారు. ఉపయుక్తమని భావించిన ప్రతి అంశం పట్ల శ్రద్ద కనబరుస్తారు. స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉంటారు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు.

కన్య

జీవిత భాగస్వామితో కలిసి సమాలోచనలు సాగిస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. మీ కృషి చాలావరకు ఫలిస్తుంది. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా పరిణమిస్తారు.

తుల

దీర్ఘాలోచనలు సాగిస్తారు. పెద్దల సలహాలను తప్పకుండా పాటిస్తారు. పొదుపుపై దృష్టి సారిస్తారు. ఉపకరించే సమాచారాన్ని తెలుసుకుంటారు. ప్రకటనలు లాభిస్తాయి.

వృశ్చికం

ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఓర్పునేర్పులతో వ్యవహరిస్తారు. రాజకీయరంగంలోని వారితో పరిచయాలు ఏర్పడతాయి. క్రమశిక్షణకు అధిక ప్రాముఖ్యతను ఇస్తారు.

ధనుస్సు

సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. లౌక్యంగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలపరంగా మార్పులు చోటు చేసుకుంటాయి. రుణాలు తీరుస్తారు.

మకరం

మంచి నైపుణ్యాన్ని కనబరుస్తారు. ఉచిత సలహాలకు దూరంగా ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలకు తేదీలు ఖరారు చేసుకుంటారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి.

కుంభం

అందరి మేలు కోరుకునే వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకుంటారు. వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆంతర్యం బయటపడకుండా గోప్యంగా వ్యవహరిస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది.

మీనం

ఇరువర్గాలతో సఖ్యత ఏర్పరచుకుంటారు. దైనందిన కార్యక్రమాల్లో మార్పులు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వేదాంత ధోరణి అవలంభిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version