Home Latest News Traffic Challan | వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ ఛలాన్లపై 50 శాతం డిస్కౌంట్

Traffic Challan | వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ ఛలాన్లపై 50 శాతం డిస్కౌంట్

Traffic Challan | వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో పడిన ఛలాన్లను వెంటనే క్లియర్ చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం 50 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను ఫిబ్రవరి 11వ తేదీలోపు కట్టే వారికి మొత్తం ఫైన్‌లో సగం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు కర్ణాటక రవాణా శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

వాహనాలపై పెండింగ్ ఛలాన్లు పెరిగిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం జరిమానా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక్క బెంగళూరులోనే రూ.500 కోట్ల మేర ఛలాన్లు వసూలు కావాల్సి ఉంది. వీటిని వీలైనంత తొందరగా వసూలు చేయాలని నిర్ణయించుకున్న కర్ణాటక ప్రభుత్వం.. వాహనదారులకు రాయితీ ప్రకటించింది. ఛలాన్లు చెల్లించాలని అనుకునేవాళ్లు దగ్గరలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదా.. అధికారిక వెబ్‌సైట్ www.bangaloretrafficpolice.gov.in ద్వారా కూడా చెల్లించాలని సూచించారు. కర్ణాటక వన్ పోర్టల్ ద్వారా కూడా ఫైన్లు కట్టవచ్చని పేర్కొన్నారు.

వాస్తవానికి ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించడాన్ని ముందుగా తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. గత ఏడాది మార్చి నెలాఖరు వరకు ఈ ఆఫర్ ఇచ్చింది. దీనికి వాహనదారుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుండటంతో మరో 10 రోజులు పొడిగించింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.250 కోట్లు చెల్లించి వాహనదారులు తమ పెండింగ్ ఛలాన్లు క్లియర్ చేసుకున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Transgender Pregnant | అబ్బాయిగా మారిన తర్వాత గర్బం దాల్చిన ట్రాన్స్‌జెండర్.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మ

Gay Couple | పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇండియన్ గే కపుల్

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

Anand Mahindra | హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే

Breaking News | పండుగ నాడు ఉచిత చీరల పంపిణీ… తొక్కిసలాటలో నలుగురు మృతి!

Exit mobile version