Home News AP Kotamreddy Sridhar Reddy | ఇకపై ఒంటరిగా తిరుగుతా.. తగ్గేదేలే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి...

Kotamreddy Sridhar Reddy | ఇకపై ఒంటరిగా తిరుగుతా.. తగ్గేదేలే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్

Kotamreddy Sridhar Reddy | ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల తర్వాత వైసీపీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇప్పుడు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. కడప నుంచి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి కోటంరెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు. ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల జోలికి వస్తే బండికి కట్టుకుని నెల్లూరు ఆంగళ్ల మధ్య లాక్కొని వెళ్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన ఆడియో తాజాగా వైరల్‌గా మారింది. ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్న సమయంలో తనకు కేటాయించిన గన్‌మెన్లను తొలగించడం పట్ల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనకు 2+2 గన్‌మెన్లను ఇచ్చిందని.. శనివారం ఇద్దరిని వాపసు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. ఎవరి ఆదేశాలతో ఈ పనిచేశారో తెలియదు గానీ.. ప్రభుత్వ పెద్దలు చెప్పకుండా మాత్రం ఇలా జరగదని అన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న సమయంలో అదనపు భద్రత పెంచాల్సింది పోయి.. ఉన్నవాళ్లను తొలగిస్తారా? అని అసహనం వ్యక్తం చేశారు. మీ ఆదేశాల ప్రకారం ఇద్దరు గన్‌మెన్లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నా అని చెప్పిన ఆయన.. మిగిలిన ఇద్దరు గన్‌మెన్లను కూడా మీకే గిఫ్ట్‌గా ఇస్తున్నా తీసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎక్కడైనా ఒంటరిగా తిరుగుతా.. ఎవరికీ భయపడను అని తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తా.. నా గొంతు ఇంకా పెరుగుతూనే ఉంటుంది.. తగ్గేదేలే అని స్పష్టం చేశారు. తన భద్రత పర్యవేక్షించే పోలీసులు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కంటే పదింతల వేధింపులు తనకు ఉన్నాయని చెప్పారు. తన ఖర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందని వాపోయారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Transgender Pregnant | అబ్బాయిగా మారిన తర్వాత గర్బం దాల్చిన ట్రాన్స్‌జెండర్.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మ

Gay Couple | పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇండియన్ గే కపుల్

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

Anand Mahindra | హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే

Breaking News | పండుగ నాడు ఉచిత చీరల పంపిణీ… తొక్కిసలాటలో నలుగురు మృతి!

Exit mobile version