Home Business Anand Mahindra | హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే

Anand Mahindra | హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే

Anand Mahindra | అదానీల వ్యాపారాలపై హిండెన్ బర్గ్ నివేదిక మీద ఎంఅండ్ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఎన్ని సవాళ్ళు వచ్చిన భారత్ ధృడంగా నిలబడుతుంది అంటూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ఎన్ని సంక్షోభాలు, తుఫానులు వచ్చినా భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగానే ఉంటుందని అన్నారు.

భారత్‌ ను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదన్నారు. సూపర్‌ పవర్‌ కావాలనే భారత్ లక్ష్యాన్ని ఇవి ఏమాత్రం ప్రభావితం చేయలేవు అని గ్లోబల్ మీడియాకు సూచించారు. ఈ విషయం పై సోషల్‌ మీడియా వేదిక ట్విటర్‌‌లో ఒక పోస్ట్‌ పెట్టారు.

ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదగడానికి వ్యాపార రంగంలో ప్రస్తుతం ఉన్న సవాళ్లు అవకాశాలను దెబ్బతీస్తాయి అని గ్లోబల్ మీడియా ఊహిస్తోంది. గ్లోబల్ మీడియా చేస్తున్న ఊహాగానాలకు అర్ధం లేదని ఆనంద్ మహీంద్రా అన్నారు.

తాము కరువులు, మాంద్యం, భూకంపాలు, తీవ్రవాద దాడులను తట్టుకున్నాం. నేను చెప్పేది ఒక్కటే భారతదేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ సవాల్ చేయొద్దు అంటూ హెచ్చరించారు

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cricket Australia | అశ్విన్‌ ‘డూప్‌’ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రాక్టీస్‌.. ఎందుకిలా ?

Income Tax | వేతన జీవులకు పాత పన్ను విధానం బెటరా.. కొత్త పన్ను విధానమా ?

Adani | అదానీ సంస్థలకు మరో షాక్.. అక్కడ నుంచి కూడా ఔట్!

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Exit mobile version