Home Entertainment Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్...

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Jabardasth Varsha | జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకుంది వర్ష. ముఖ్యంగా ఇమ్మాన్యుయెల్‌తో నడిపిన లవ్ ట్రాక్ ఆమెను పాపులర్ చేసింది. అదే ప్రేక్షకులకు దగ్గర చేసింది. అప్పట్నుంచి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఇలా మల్లెమాల ప్రొడక్షన్స్‌ ఏ ఈవెంట్ చేసిన ఈ జోడీ స్టేజిపై సందడి చేస్తూనే ఉంది. ఇంతకీ వీళ్లది రియల్ లవ్ స్టోరీనా? ప్రమోషనల్ లవ్ స్టోరీనా అని అంతా అయోమయోంలో ఉన్న టైమ్‌లో బజర్దస్ వర్ష షాకింగ్ న్యూస్ చెప్పింది. సడెన్‌గా రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ అయిపోయింది అంటూ యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది.

సడెన్‌గా రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. నేనైతే చాలా షాకయ్యాను అంటూ ముందుగా ఆ వీడియోలో పేర్కొంది. కొన్ని పరిస్థితుల వల్ల ఎవరికీ చెప్పకుండానే ఎంగేజ్‌మెంట్ జరగబోతుందని తెలిపింది. తనకు సిగ్గేస్తోందని చెప్పుకొచ్చింది. పెళ్లి కొడుకును చివరలో చూపిస్తాను అంటూ తన దగ్గర ఉన్న చీరలు, నగలు అన్నింటినీ చూపించింది. అందులో తనకు సూటయ్యే చీర, నగలు పెట్టుకుని ముస్తాబైంది. ఆ వీడియో మొత్తం చూపించిన తర్వాత చివరలో ఈ ఎంగేజ్‌మెంట్ తనది కాదని షాకిచ్చింది. రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత రాత్రికి రాత్రే తమ ఎంగేజ్‌మెంట్ అని సడెన్‌గా చెప్పారు. దీంతో త్వరగా రెడీ అయి వచ్చేశానంటూ లాస్ట్‌లో ట్విస్ట్‌ ఇచ్చింది. తన ఎంగేజ్‌మెంట్ గురించి కూడా తొందరలోనే చెప్తానులే అంటు చెప్పుకొచ్చింది.

జబర్దస్త్ వర్ష చేసిన ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఓవర్‌గా సిగ్గుపడినప్పుడే ఇదంతా ఫ్రాంక్ అని అర్థం చేసుకోవాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Transgender Pregnant | అబ్బాయిగా మారిన తర్వాత గర్బం దాల్చిన ట్రాన్స్‌జెండర్.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మ

Gay Couple | పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇండియన్ గే కపుల్

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

Anand Mahindra | హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే

Breaking News | పండుగ నాడు ఉచిత చీరల పంపిణీ… తొక్కిసలాటలో నలుగురు మృతి!

Exit mobile version