Home News International Bill Gates | మళ్లీ ప్రేమలో పడిన బిల్‌ గేట్స్.. ఓరాకిల్ సీఈవో భార్యతో డేటింగ్?

Bill Gates | మళ్లీ ప్రేమలో పడిన బిల్‌ గేట్స్.. ఓరాకిల్ సీఈవో భార్యతో డేటింగ్?

Bill Gates | మైక్రోసాఫ్ట్‌ కో- ఫౌండర్ బిల్‌ గేట్స్ 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డారు. పౌలా హర్డ్ అనే ఆమెతో ఆయన డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరంటే 2019లో క్యాన్సర్‌ తో మరణించిన ఒరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈఓ మార్క్ హర్డ్ సతీమణి. ఆమె వయసు 60 సంవత్సరాలు. వీరిద్దరూ సుమారు సంవత్సర కాలంగా డేటింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.

గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్ మెన్స్‌ సింగిల్స్ ఓపెన్‌ టెన్నిస్‌ గేమ్‌ సందర్భంగా మొదటిసారిగా బిల్‌ గేట్స్, పౌలా కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ సమయంలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఆటను వీక్షించారు. ఈ ఇద్దరినీ విడదీయలేని కపుల్ గా భావిస్తున్నామని, పౌలా ఎప్పుడూ మిస్టరీ వుమనే అని వీరి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈవెంట్ ప్లానర్ గా పని చేస్తున్న పౌలా హర్డ్.. లోగడ టెక్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పని చేశారు. టెన్నిస్ అంటే బిల్ గేట్స్ కి, ఈమెకు కూడా ఇష్టం కావడంతో ఇద్దరూ దగ్గరయ్యారు. పౌలాకు ఇద్దరు కూతుళ్లున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 23 న లండన్ లో జరిగిన లేవర్ కప్ టోర్నమెంట్ ని కూడా బిల్ గేట్స్, పౌలా కలిసే చూశారు. ఏమైనా వీరు రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉన్నారన్నది తథ్యం అని మీడియా కథనాలు వివరించాయి.

మెలిండా ఫ్రెంచ్ గేట్స్, బిల్ గేట్స్ ఇద్దరూ 2021 మే నెలలో విడాకులు తీసుకున్నారు. 30 ఏళ్ళ తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పారు. అదే ఏడాది ఆగస్టులో వీరి డైవోర్స్ ఖరారయింది. అయితే తాము నిర్వహించిన ఫౌండేషన్ ని ఇద్దరూ కలిసి కొనసాగించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము విడాకులు తీసుకుంటున్నామని బిల్ గేట్స్ నాడు ప్రకటించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

TSRTC | పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్‌!

Cow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.. కౌ హగ్‌ డేనట.. అందరూ ఇలా చేయాలన్న పశుసంవర్ధక శాఖ!

Narendra Modi | దేశం కోసమే నా జీవితం అంకితం చేశా.. కాంగ్రెస్‌ వల్ల దశాబ్ద కాలాన్ని కోల్పోయాం.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌!

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

Exit mobile version