Home Latest News Man trapped in cave | 43 గంటలుగా బండరాళ్ల మధ్య యువకుడి నరకయాతన.. క్షేమంగా...

Man trapped in cave | 43 గంటలుగా బండరాళ్ల మధ్య యువకుడి నరకయాతన.. క్షేమంగా బయటకు తీసిన అధికారులు

Man trapped in cave | కామారెడ్డి జిల్లాలో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య చిక్కుకున్న షాడ రాజును అధికారులు క్షేమంగా బయటకు తీశారు. దాదాపు 43 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ చేసి రాజు ప్రాణాలు కాపాడారు. చికిత్స కోసం రాజును ఆస్పత్రికి తరలించారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు స్నేహితుడితో కలిసి మంగళవారం సాయంత్రం ఘన్‌పూర్ శివారు ప్రాంతంలోని అడవిలోకి వేటకు వెళ్లాడు. బండరాళ్లపై నుంచి వెళ్తుండగా రాళ్ల మధ్యలో సెల్‌ఫోన్ పడిపోయింది. దీంతో ఫోన్‌ను బయటకు తీసేక్రమంలో తలకిందులుగా రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడు.

రాజు వెంట వేటకు వచ్చిన మిత్రుడు అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వేటకు వెళ్లడం.. అధికారులు ఏమంటారో అన్న భయంతో బుధవారం మధ్యాహ్నం వరకు సమాచారం అందించలేదు. కుటుంబసభ్యులు, గ్రామస్థులే రాజును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి అధికారులకు సమాచారం అందించారు.

దీంతో అధికారులు రంగంలోకి దిగి జేసీబీలు, యంత్రాల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కేవలం రెండు, కాళ్లు, ఒక చేతి మాత్రమే పైకి కనిపిస్తుండటంతో బయటకు లాగడం ఇబ్బందిగా మారింది. అయినా అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బండలను బ్లాస్టింగ్ చేసి రాజును బయటకు తీశారు. రెండు కాళ్లు బయటకు వచ్చినా.. తల అందులోనే ఇరుక్కుపోవడంతోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు రాజు ప్రాణాలను అధికారులు కాపాడి.. క్షేమంగా బయటకు తీశారు. ఏఎస్పీ అన్యోన్య ఆధ్వర్యంలో 43 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Anklets | ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి.. బంగారు పట్టీలు ధరిస్తే ఏమవుతుంది?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version