Home Lifestyle Do you know Anklets | ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి.. బంగారు పట్టీలు ధరిస్తే ఏమవుతుంది?

Anklets | ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి.. బంగారు పట్టీలు ధరిస్తే ఏమవుతుంది?

Anklets | ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. చేతులకు గాజులు, చెవులకు దుద్దులు, కాళ్లకు పట్టీలు చేపించాలని తల్లిదండ్రులు సంబరపడిపోతుంటారు. కాళ్లకు వెండి పట్టీలేసుకుని గజ్జెల సప్పుడు చేసుకుంటూ ఇంట్లో ఆడపిల్లలు తిరుగుతుంటే ఆ శబ్ధం ఎంతో వినసొంపుగా ఉంటుంది. కాకపోతే వెండికి బదులు కాస్త డబ్బున్న వాళ్లు ఇప్పుడు బంగారు పట్టీలు ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం చూసినా.. శాస్త్రాల ప్రకారం చూసినా ఆడపిల్లలు కాళ్లకు వెండిపట్టీలనే ధరించాలని ఉంది. దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉందట. అదేంటంటే..

బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవితో పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే బంగారాన్ని అంత పవిత్రంగా చూస్తారు. లక్ష్మీదేవిగా కొలుస్తూ మొక్కుతుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు.. పసుపు. బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి బంగారాన్ని కాళ్లకు ధరించకూడదట. కేవలం బంగారాన్నే కాదు.. పసుపు మినహా ఆ రంగుల్లో ఉన్న ఎలాంటి వస్తువులనూ కాళ్లకు ధరించకూడదట.

అంతేకాదు.. వెండి మన శరీరంలోని వేడిని బయటకు పంపించేస్తుందట. ఒకప్పుడు ముసలోళ్ల కాళ్లకు పెద్ద పెద్ద కడాలు, నడుముకు వడ్డాణాలు, కాళ్లకు భారీ సైజులో పట్టగొలుసులు ఉండేవి. ఇప్పుడు పట్టగొలుసులంటే ఐదారు తులాల లోపే ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు పట్టగొలుసులంటే కనీసం 20-30 తులాలు ఉండేవి. శరీరంలోని వేడిని గ్రహించి చలువ చేస్తుంది కాబట్టే అంత పెద్ద వెండి ఆభరణాలను కాళ్లకు ధరించేవారు. వెండి వల్ల దుష్టశక్తుల నుంచి రక్షణ కూడా ఉంటుందట. నెగెటీవ్‌ ఆలోచనలు కూడా రావట. కాబట్టి కాళ్లకు బంగారు పట్టీలకు బదులు వెండి పట్టీలనే ధరించాలని పెద్దలు చెబుతున్నారు.

Follow Us : Facebook, Twitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Exit mobile version