Home Latest News Bird flu | కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8 వేల బాతులు, కోళ్లు చంపేయాలని...

Bird flu | కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8 వేల బాతులు, కోళ్లు చంపేయాలని ఆదేశాలు

Bird flu | కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కొట్టాయం జిల్లలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టారు. ఆ రెండు గ్రామాలకు కిలోమీటర్ పరిధిలో పెంచుతున్న బాతులు, కోళ్లు, పెంపుడు పక్షులను చంపేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బర్డ్ ఫ్లూ ( Bird flu ) మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య పనులతో పాటు క్రిమిసంహారక మందులను చల్లాలని ఆదేశించారు.

ప్రభావిత గ్రామాలకు పది కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలను నిషేధించాలని, అక్కడి నుంచి ఎగుమతులు కూడా నిషేధించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాతుల ఫామ్‌తో పాటు, కోళ్ల ఫామ్‌లో పక్షులు మరణించడంతో వాటి నమూనాలను భోపాల్‌కు పంపారు. పరీక్షల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

స్థానికంగా ఉన్న 8 వేల బాతులు, కోళ్లను చంపేయాలని నిర్ణయించారు. కేరళ జంతు సంరక్షణ శాఖ తో పాటు స్థానిక సంస్థలు, రెవన్యూ, అటవీ, ఆరోగ్య శాఖ సమన్యవంతో బర్డ్ ఫ్లూ నివారణకు చర్యలు చేపట్టారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Health Tips | నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు ఇవే కావచ్చు! ఒకసారి చెక్ చేసుకోండి..

Exit mobile version