Home Latest News Leopard entered in hetero lab | హైదరాబాద్ శివారులోని హెటిరో ల్యాబ్‌లో చిరుత.. 11...

Leopard entered in hetero lab | హైదరాబాద్ శివారులోని హెటిరో ల్యాబ్‌లో చిరుత.. 11 గంటలు కష్టపడి పట్టుకున్న అధికారులు

Leopard entered in hetero lab | హెటిరో ల్యాబ్స్‌లోకి ప్రవేశించిన చిరుతను ఎట్టకేలకు నెహ్రూ జూ పార్క్ సిబ్బంది బంధించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లోకి శనివారం ఉదయం 4 గంటలకు చిరుత ప్రవేశించింది. ఎప్పుడూ జనసంచారం ఉంటే ల్యాబ్‌లోకి చిరుత రావడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అటవీ శాఖకు సమాచారం అందించారు.

అటవీ శాఖ సిబ్బంది నెహ్రూ జూ పార్క్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో చిరుతను పట్టుకునేందుకు స్పెషల్ టీం వచ్చింది. దాదాపు 11 గంటలపాటు కష్టపడి చిరుతను బంధించింది. మత్తు మందు ఇంజెక్షన్ సహాయంతో చిరుతను పట్టుకోగలిగారు. చిరుతకు ఇంజెక్షన్ ఇచ్చి మత్తులోకి జారుకోగానే బోనులో బంధించారు. నెహ్రూ జూ పార్క్‌కు తరలించారు. దీంతో హెటిరో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Pawan kalyan – Ali | గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్‌పై అలీ ఓపెన్ కామెంట్స్

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

Exit mobile version