Home News International India Vs Bangladesh | ఆరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ జకీర్ హసన్.....

India Vs Bangladesh | ఆరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ జకీర్ హసన్.. విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్

photo credit: ICC twitter

India Vs Bangladesh | బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయి 272 పరగులు చేసింది. బంగ్లాదేశ్‌కు మరో నాలుగు వికెట్లు చేతిలో ఉండగా.. విజయానికి ఇంకా 241 పరుగులు చేయాలి. ఆలోపు 4 వికెట్లు తీస్తే తొలిటెస్టు భారత్‌దే అవుతుంది. బంగ్లా ఓపెనర్లు మొదట్లో ఇబ్బందిపెట్టినా.. భారత బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయారు.

బంగ్లాదేశ్ తరఫున తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హసన్ సెంచరీ చేశాడు. 219 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ చేయగలిగాడు. మరో ఓపెనర్ నజ్ముల్‌తో కలిసి తొలి వికెట్‌కు 124 పరుగులు చేశారు. అయితే ఆ తర్వాత వికెట్లు టపటపా పడిపోయాయి. భారత బౌలర్లు ఓపెనర్ నజ్ముల్‌తో పాటు యాసిర్ అలీని 5 పరుగుల వద్ద ఔట్ చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లిటన్ దాస్, ముష్ఫికర్ భారత్ బౌలర్లను కాసేపు నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇద్దరూ పెవిలీయన్‌కు చేరారు. మరో బ్యాటర్ నరుల్ హసన్ 3 పరుగులకే ఔటయ్యాడు.

భారత బౌలర్ల దాటికి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 272 పరుగులు చేయగలిగింది. అక్షర్ పటేల్ మూడు వికెట్లు, ఉమేశ్, కుల్‌దీప్, అశ్విన్ తలో వికెట్ తీశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Koo vs Twitter | కూ సంస్థకు షాకిచ్చిన ట్విట్టర్.. అకౌంట్ తొలగింపు

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Pawan kalyan – Ali | గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్‌పై అలీ ఓపెన్ కామెంట్స్

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

Exit mobile version