Home News International Weather Alert in America | అమెరికాలో వాతావరణ శాఖ అలర్ట్‌.. సరిపడా సరుకులతో పాటు...

Weather Alert in America | అమెరికాలో వాతావరణ శాఖ అలర్ట్‌.. సరిపడా సరుకులతో పాటు ఇసుక బస్తాలు దగ్గర ఉంచుకోవాలన్న అధికారులు!

Weather Alert in America | అమెరికాను మంచు తుఫాన్లు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు అమెరికాలోని వివిధ ప్రాంతాలను మంచు పూర్తిగా కప్పేసింది. ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలోని ఉత్తర ప్రాంతంలో పెను తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు, మంచు కరగడం వల్ల వరదల ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వాటి వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం కూడా ఉన్నట్లు వివరించారు. ఈ తుఫాన్ల వల్ల చిన్న నీటి కాలువలు, సరస్సులు వంటివి పొంగుపొర్లుతాయని హెచ్చరించారు. వాటి ఫలితంగానే నీటి ప్రవాహాం పెరిగి రోడ్లు వరద నీటితో మునిగిపోతాయని పేర్కొన్నారు. ఈ హెచ్చరికలు జారీ అయిన వెంటనే మాంటరీ కౌంటీ తన ప్రజలను అప్రమత్తం చేసింది.

ప్రజలందరూ కూడా ముందుగానే రెండు వారాలకు సరిపడా సరుకులను, రెండు ఇసుక బ్యాగులను కూడా దగ్గర ఉంచుకోవాలని సూచించింది. ప్రమాద సమయంలో ఉపయోగపడతాయని సూచించింది. ఫిబ్రవరి నెలలోనే కాలిఫోర్నియా మంచు గుప్పిట్లో కప్పి ఉంది. విపరీతమైన గాలులు వీయడం వల్ల నగరం అల్లకల్లోలం అయ్యింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Exit mobile version