Friday, March 31, 2023
- Advertisment -
HomeNewsInternationalTurkey Earthquake | తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి విలయతాండవం.. భూకంప ధాటికి 640 మందికి...

Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి విలయతాండవం.. భూకంప ధాటికి 640 మందికి పైగా సజీవ సమాధి

Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాలపై ప్రకృతి విలయతాండవం చేసింది. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడింది. రెండు దేశాల మధ్య ఏర్పడిన భూ ప్రకంపనలకు రెండు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. భూకంప తీవ్రతకు భవనాలు నేలమట్టమయ్యాయి. వందలాది మంది నిద్రలోనే సజీవ సమాధి అయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రెండు దేశాల్లో 640 మందికిపైగా దుర్మరణం చెందారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తుర్కియే కాలమాన ప్రకారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత 7.8గా నమోదైందని పేర్కొంది. సిరియా సరిహద్దు అయిన ఆగ్నేయ తుర్కియేలోని గాజియాంతెప్‌ సమీపంలో మొదటి భూకంపం సంభవించిందని వెల్లడించింది. ఇక్కడ 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. కాగా, 15 నిమిషాల తర్వాత సెంట్రల్‌ తుర్కియేలో రెండో భూకంపం సంభవించిందని తెలిపింది. ఈ రెండు భూకంపాల ప్రభావంతో దాదాపు 18 సార్లు భూప్రకంపనలు వచ్చాయని చెప్పింది. వీటికారణంగా తుర్కియేలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి.

గాఢనిద్రలో ఉన్న సమయంలో విపత్తు

తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జనాలు అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో విపత్తు సంభవించడంతో మరణాల సంఖ్య భారీగా నమోదవుతోంది. తుర్కియేలో ఇప్పటివరకు 284 మంది మరణించారని ఆ దేశ ఉపాధ్యక్షుడు పుయత్‌ ఒక్తే వెల్లడించారు. 2300 మందికి పైగా గాయపడినట్టు పేర్కొన్నారు. ఇక సిరియాలో భూకంప ధాటికి 237 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 600 మంది వరకు గాయపడ్డారని వెల్లడించింది. అయితే భవనాల శిథిలాల కింద మరింత మంది ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Telangana Budget 2023-24 | 2 లక్షల 90 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన హరీశ్‌ రావు

Yamini Sharma | ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గుంజుడే గుంజుడు.. యామినీ శర్మ సంచలన వ్యాఖ్యలు

Rahul Dravid on Border Gavaskar Trophy| టెస్టు క్రికెట్‌లో అదే ముఖ్యం.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

caste certificate for dog | కుక్కకు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌.. ఆధార్‌ కార్డు ప్రూఫ్‌గా పెట్టి మరి అప్లై..

Peddagattu Lingamanthula Jathara | ఘనంగా ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర.. జనసంద్రమైన గొల్లగట్టు

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News