Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentAllu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు...

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Allu Aravind | తన కోడలు, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి గురించి టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ ఇంట్రెస్టింగ్ మెంట్స్ చేశాడు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎక్కడ తన కోడలి గురించి ప్రస్తావించని అల్లు అరవింద్ మొదటిసారిగా ఓ సినిమా సక్సెస్‌ మీట్ లో ఆమె గురించి మాట్లాడాడు. తనకు పనిచేయాల్సి అవసరం లేకున్నా కష్టపడతుందని ప్రశంసలు కురిపించాడు.
సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమా సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న అల్లు అరవింద్.. ఈ సినిమాలో నాకు ఒక అంశం బాగా నచ్చింది. ప్రతి ఆడపిల్ల కూడా ఈ సినిమాకి మీ తల్లిదండ్రులను తీసుకొని వెళ్లండి. ఎందుకంటే ఆడపిల్ల అనగానే ప్రతి తల్లిదండ్రులూ కూడా పెంచాలి, చదివించాలి, చివరికి చదివిన దానిని పక్కన పెట్టి పెళ్లి చేసి పంపేయాలని ఆలోచిస్తుంటారు. కానీ ఆ ఆడపిల్లకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయని, వాటిని తల్లిదండ్రులు గౌరవించాలని ఈ సినిమా తెలియజేసింది అని అల్లు అరవింద్ తెలిపారు.

ఈ మూవీ చూశాక నేను కూడా ఇంటికి వెళ్లి నా భార్య కోరికలు ఏంటో అడిగి తెలుసుకున్నాను, అంతలా ఈ చిత్రం నన్ను ప్రభావితం చేసింది. అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవడానికి అంగీకరించనని తెలిపారు. తన కోడలు స్నేహారెడ్డికి పనిచేయాల్సిన అవసరం లేదని.. గొప్ప ఇంట్లో పుట్టి.. బన్నీ లాంటి పెద్ద స్టార్‌ను పెళ్లి చేసుకుందని.. అయినప్పటికీ ఇంకా వర్క్ చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడటానికి ప్రయత్నిస్తోందని ప్రశంసలు కురిపించారు. ప్రతి ఆడపిల్ల కూడా వాళ్లు కూడా తన కాళ్ల మీద తాను నిలబడాలని ఆకాంక్షించారు.

నటుడు సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రైటర్‌ పద్మభూషణ్‌. ఈ చిత్రం ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

TP Gajendran | ప్రముఖ కమెడియన్‌, సీఎం స్టాలిన్‌ స్నేహితుడు కన్నుమూత.. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన మర్నాడే..

Sundeep Kishan | రెజీనాతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్

Vani Jairam | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ వాణీ జయరాం కన్నుమూత!

Vani Jairam | వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు…పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే ఓ క్లారిటీ!

Vani Jairam | వాణీ జయరాం కుటుంబ నేపథ్యం తెలుసా.. ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News