Tuesday, April 16, 2024
- Advertisment -
HomeLatest NewsPeddagattu Lingamanthula Jathara | ఘనంగా ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర.. జనసంద్రమైన గొల్లగట్టు

Peddagattu Lingamanthula Jathara | ఘనంగా ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర.. జనసంద్రమైన గొల్లగట్టు

Peddagattu Lingamanthula Jathara | పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతరలో ప్రధాన ఘట్టమైన దేవరపెట్టెను ఆదివారం అర్ధరాత్రి పూజారులు, యాదవ భక్తులు ఊరేగింపులతో వైభవంగా పెద్దగట్టుకు తీసుకొచ్చారు.

15 రోజుల నుంచి పూజలు

15 రోజుల క్రితం చీకటాయపాలెం నుంచి కేసారం వచ్చిన దేవరపెట్టెను పెద్దగట్టుకు తరలించారు, దిష్టిపూజ నిర్వహించి మరుసటి రోజే కేసారం తీసుకెళ్లారు. అక్కడే 15 రోజులు పూజలు నిర్వహించి జాతర మొదటి రోజైన ఆదివారం పెద్దగట్టుకు చేర్చారు.

ఓ లింగా నమాస్మరణతో మార్మోగిన పెద్దగట్టు

33 మంది దేవతామూర్తులతో నిండిన దేవరపెట్టెను తాకేందుకు వేయి కళ్లతో లక్షలాది భక్తులు ఎదురు చూశారు. దేవరపెట్టె పెద్దగట్టుకు చేరుకోగానే భక్తులు ఓలింగా ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు నలుదిక్కులు మారుమోగిపోయాయి.

పెట్టెను మోసిన మంత్రి జగదీశ్ రెడ్డి

మందగంపలతో పాటు గజ్జెల లాగులు ధరించిన యాదవ భక్తుల బేరీల మోతలతో చేసిన విన్యాస్యాలు ఆధ్యంతం ఆకట్టుకున్నాయి. పెద్దగట్టంతా జనసంద్రమైంది. దేవరపెట్టె తరలింపు కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. కేసారంలో దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. భారీ ఊరేగింపు మధ్య పెట్టెను మోసి తరలింపును ప్రారంభించారు.

రెండో రోజు జాతరలో ఏం జరుగుతుంది

ఆచారం ప్రకారం జాతర రెండో రోజైన ఇవాళ (సోమవారం) దేవతలకు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించి లింగమంతులస్వామికి నైవేద్యాలను సమర్పిస్తారు. అనంతరం ప్రత్యేకంగా వండిన బోనాన్ని జాగిలాలకు పోస్తారు. అలా బండపై పోసిన ప్రసాదాన్ని పూజారులు ఆరగిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Vegetarian City in India | ప్రపంచంలోనే మొదటి శాఖాహార నగరం గురించి తెలుసా ? అదీ.. మన భారత దేశంలోనే ఉంది.. ఎక్కడంటే?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News