Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsRahul Dravid on Border Gavaskar Trophy| టెస్టు క్రికెట్‌లో అదే ముఖ్యం.. టీమిండియా హెడ్‌...

Rahul Dravid on Border Gavaskar Trophy| టెస్టు క్రికెట్‌లో అదే ముఖ్యం.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

Rahul Dravid on Border Gavaskar Trophy| | టైమ్‌ 2 న్యూస్‌, నాగ్‌పూర్‌: టెస్టు క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాలంటే ఫీల్డింగ్‌ ప్రమాణాలు అత్యున్నతంగా ఉండాలని రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి నాలుగు మ్యాచ్‌ల ‘బోర్డర్‌-గవాస్కర్‌’ టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి ఆసీస్‌ టూర్‌ మ్యాచ్‌ లేకుండా.. నేరుగా తొలి టెస్టు బరిలో దిగనుంది.

ప్రస్తుతం టీమిండియా నాగ్‌పూర్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా.. ఆసీస్‌ బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో శిక్షణ కొనసాగిస్తోంది. ఉపఖండంలో స్పిన్‌ పిచ్‌లు ఎదురవడం సహజం కాగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు కంగారూలు కసరత్తులు చేస్తున్నారు. గత నెలలో శ్రీలంక, న్యూజిలాండ్‌పై టీ20, వన్డే సిరీస్‌లు ఆడిన భారత్‌ ఇక రెడ్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ ప్రారంభించింది.

టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా గంటల పాటు నెట్స్‌లో చెమటోడుస్తుండగా.. తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి పిలుపు అందుకున్న యువ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ తమ బ్యాట్లకు పదును పెంచుతున్నారు. గాయం తర్వాత తిరిగి వచ్చిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌, బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ బిజీగా గడుపుతుంటే.. హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ సుదీర్ఘ స్పెల్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు.

మరో మూడు రోజుల్లో ప్రతిష్ఠాత్మక సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ద్రవిడ్‌ మాట్లాడుతూ.. టెస్టుల్లో స్లిప్‌ ఫీల్డింగ్‌ చాలా ముఖ్యమని అన్నాడు. భారత ఆటగాళ్ల ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

‘ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. గత నెలంతా వన్డేలు, టీ20లు ఎక్కువగా ఆడాం. చాన్నాళ్ల తర్వాత టెస్టులు ఆడుతుండటం బాగుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌ను పక్కనపెట్టి సుదీర్ఘ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు ప్లేయర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫీల్డింగ్‌లోనూ కష్టపడుతున్నారు. టెస్టుల్లో అది కీలకం స్లిప్‌ క్యాచ్‌లు ఒడిసిపట్టడం చాలా ముఖ్యం. అందుకే ఫీల్డింగ్‌పై దృష్టిపెట్టాం. సుదీర్ఘమైన సెషన్స్‌ లభించడంతో కోచింగ్‌ సిబ్బందిగా మాకెంతో ఉత్సాహంగా ఉంది. దాదాపు రెండు వారాలు ఖాళీ దొరకడంతో ప్రణాళికలు, సన్నద్ధత కోసం తగినంత సమయం వెచ్చించాం. కుర్రాళ్లు తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకముంది’ అని ద్రవిడ్‌ తెలిపాడు.

సుదీర్ఘంగా జరిగే క్యాంపులను ఎక్కువగా ఇష్టపడతానన్న ద్రవిడ్‌.. ఆటగాళ్లంతా చక్కట ప్రాక్టీస్‌ చేస్తున్నారని పేర్కొన్నాడు. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భారత్‌ జట్టు విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడదే జోరులో సొంతగడ్డపై సిరీస్‌ పట్టేయడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్లూ్యటీసీ) ఫైనల్‌కు చేరేందుకు భారత జట్టు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ప్లేస్‌లో కొనసాగుతున్న భారత్‌.. ఈ సిరీస్‌ను 2-0 లేదా అంతకంటే మెరుగైన ఫలితంతో కైవసం చేసుకుంటే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌ ప్లేస్‌కు చేరనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cricket Australia | అశ్విన్‌ ‘డూప్‌’ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రాక్టీస్‌.. ఎందుకిలా ?

Suresh Raina | ఆసీస్‌ నిర్ణయం ఆశ్చర్యపరిచింది: సురేశ్‌ రైనా

Vinod Kambli | క్రికెటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వినోద్‌ కాంబ్లీ

Cricket Australia | అశ్విన్‌ ‘డూప్‌’ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రాక్టీస్‌.. ఎందుకిలా ?

Afridi Marriage | ఒక ఇంటివాడైన అఫ్రిది.. దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురితో ‘నిఖా’

Joginder Sharma | వరల్డ్‌ కప్‌ వీరుడి వీడ్కోలు.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జోగిందర్‌ శర్మ

Hardik Pandya | ధోనీ అడుగుజాడల్లో హార్దిక్‌.. సారథ్య బాధ్యతతో తగ్గిన పాండ్యా స్ట్రయిక్‌రేట్‌

Hanuma Vihari | మణికట్టు విరిగినా.. వెరవకుండా విహారి బ్యాటింగ్‌.. రంజీలో అద్భుతం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News