Saturday, September 23, 2023
- Advertisment -
HomeNewsInternationalViral News | డబ్బు మీద విరక్తి పుట్టి 16 ఏళ్లుగా గుహలోనే!

Viral News | డబ్బు మీద విరక్తి పుట్టి 16 ఏళ్లుగా గుహలోనే!

Viral News | నేటి సమాజంలో డబ్బు లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎంత సంపాదించినప్పటికీ ఇంకా కావాలనిపిస్తోంది కూడా. డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం, మర్యాదలు అని కూడా చాలా సంఘటనలు రుజువు చేశాయి. అయితే అసలు డబ్బు అంటేనే విరక్తి పుట్టిన ఓ వ్యక్తి సుమారు 16 ఏళ్ల నుంచి ఓ గుహలో ఉంటున్నాడు.

వినడానికి విడ్డూరంగా ఉన్నా అసలు అతని స్టోరీ ఏంటో తెలుసుకుందామా..!

అమెరికాకు చెందిన డేనియల్ షెల్లాబార్జర్‌ అలియాస్‌ స్వీలో కొన్ని సంవత్సరాల క్రితం వరకు అందరిలాగానే జీవించేవాడు. ఓ మంచి ఉద్యోగం, సరిపడినంత జీతం, ఓ అద్దె ఇల్లు. అలా జీవిస్తున్న అతనికి కొంతకాలానికి ఇంటికి అద్దె కట్టడం నచ్చలేదు. దాంతో ఓ రోజు తాను చేస్తున్న ఉద్యోగం, అద్దె ఇల్లు వదిలి ఓ గుహలోకి వెళ్లి ప్రశాంతంగా జీవించాలని అనుకున్నాడు.

అలా వెళ్లాలి అనుకున్న సమయంలో అతని వద్ద కొంత డబ్బు ఉంది. దానిని ఓ పబ్లిక్ టెలిఫోన్ వద్ద విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు తనకు ఎంతో స్వేచ్ఛ లభించిందని ఆయన పేర్కొన్నాడు. అలా వదిలేసి వెళ్తున్న సమయంలో విలువైన దానిని వదులుతున్నట్లు కాకుండా ఏదో పెద్ద సమస్యను తన గుండెల మీద నుంచి దించినట్లు ఫీల్‌ అయ్యానని తెలిపాడు.

అలా యూటా రాష్ట్రంలోని మోఅబ్ పట్టణానికి దగ్గరలోని ఓ గుహలోనికి వెళ్లిపోయాడు. గుహలో ఉన్న డేనియల్ దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. దాంతో ఆకలి వేస్తే చెత్త కుప్పలు వెదకడం మొదలు పెట్టాడు. అందులో దొరికిన వస్తువులను, ఆహార పదార్థాలను తన వెంట తెచ్చుకునేవాడు. మాంసాహారం తినాలనుకున్నప్పుడు మాత్రం రోడ్డు మీద చనిపోయిన వస్తువులను తెచ్చుకొని వండుకుని తినేవాడు.

అమెరికా ప్రభుత్వం ఇలా ఇళ్లు , వాకిలు లేని వారి కోసం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. దానిని స్వీ ఉపయోగించుకోవచ్చు. కానీ దానిని తిరస్కరించాడు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే బ్లాగు రాయడానికి లైబ్రరీకి వెళ్లేవాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గుహలో గడిపిన స్వీ తిరిగి 2016లో మామూలు జీవితంలోనికి రావాల్సి వచ్చింది.

ఎందుకంటే స్వీ తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వారిని చూసుకోవడానికి స్వీ తన మామూలు జీవితంలోనికి వచ్చాడు. అప్పటి నుంచి కొన్ని మీడియా సంస్థలు ఆయన జీవితాన్ని కథనాలుగా ప్రచురిస్తున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News