Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentBalakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

Balakrishna | కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మారిపోయింది. అలాగే మన హీరోల ఆలోచనలు కూడా మారిపోయారు. సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోలేనంత మార్పులు చేర్పులు మొదలయ్యాయి. అంతకు ముందు కేవలం థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చేసిన ఆడియన్స్ కు.. కరోనా తర్వాత ఓటిటి అంటే ఏంటో తెలిసింది. అందులో వచ్చే కంటెంట్ ఎంత బలంగా ఉంటుందో అర్థమైంది.

కరోనా వైరస్ కారణంగా మన దర్శక నిర్మాతలకు తగిలిన మొట్టమొదటి షాక్ ఇదే. కంటెంట్ బాగా లేకపోతే థియేటర్ వైపు కనీసం చూడడం లేదు ప్రేక్షకులు. మరోవైపు మూడేళ్ల కింది వరకు కేవలం థియేటర్ మాత్రమే కూర్చున్న హీరోలు ఇప్పుడిప్పుడే డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు. ఓటీటిలో ఉన్న మత్తు తెలుసుకున్నారు. అందుకే వెండితెరతో సమానంగా బుల్లితెరకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వెంకటేష్, రానా లాంటి హీరోలు వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేశారు. ఇద్దరు కలిసి నటించిన రానా నాయుడు మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. తాజాగా బాలకృష్ణ కూడా ఇదే చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ అంటూ ఈయన చేసిన టాక్ షో అదిరిపోయింది. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి సీజన్ 2 కూడా చేశారు. ఇది కూడా సూపర్ హిట్ అయింది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా నిలిచింది అన్ స్టాపబుల్.

బాలకృష్ణ హోస్టింగ్ ఈ టాక్ షోకు ఆరో ప్రాణం. ఇదిలా ఉంటే ఈయన డిజిటల్ ఎంట్రీ అదిరిపోవడంతో త్వరలోనే ఆహాలో బాలకృష్ణతో ఒక వెబ్ సిరీస్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు అల్లు అరవింద్. నిజానికి బాలయ్యతో సినిమా కోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు మెగా నిర్మాత. కాకపోతే ఈ ఇద్దరి మధ్య అంత క్లోజ్ నెస్ కుదరలేదు. కానీ అన్ స్టాపబుల్ తర్వాత బాలయ్య, అల్లు అరవింద్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. దాంతో ఆయనతో సినిమా కోసం అల్లు అరవింద్ తన కాంపౌండ్ లో ఉన్న దర్శకులకు చెప్పి ఒక కథ సిద్ధం చేయిస్తున్నాడు.

మరోవైపు అన్ని అనుకున్నట్టు జరిగితే వెబ్ సిరీస్ కూడా చేయాలని ఆలోచిస్తున్నాడు. దీని కోసం కూడా ఒక కథ సిద్ధం చేయాలని తన దగ్గర ఉన్న మేకర్స్ కు అల్లు అరవింద్ ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం అయితే ఖాయం అయిపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Onion Price | వామ్మో కిలో ఉల్లి ధర రూ. 1200.. కొనకముందే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి!

America Vs China | హీటెక్కిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. చైనాపై నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు!

Viral News | భార్య కోసం రూ.7 కోట్లతో గుడి కట్టించిన భర్త.. ఎందుకో తెలుసా?

Doctor Preethi | డాక్టర్‌ ప్రీతి కేసులో కీలక మలుపు.. లభించిన ఆధారం!

WPL 2023 | అవే సీన్స్‌ రిపీట్‌.. ఐపీఎల్‌ ఆరంభ పోరులో జరిగినట్లే ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లోనూ జరిగాయి !

WPL 2023 | డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌కు అదిరిపోయే ఆరంభం.. బోణీ కొట్టిన ముంబై

Marriage | పెళ్లి కోసం వెరైటీ మేకప్ ట్రై చేసిన పెళ్లి కూతురు.. దడుసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు!

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News