Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentAmitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Amitabh Bachchan | ప్ర‌భాస్ హీరోగా వ‌స్తున్న ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి చోటుచేసుకుంది. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంలో అత‌ని ప‌క్క‌టెముక‌లు విరిగాయి. ఈ విష‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ స్వ‌యంగా త‌న బ్లాగులో వెల్ల‌డించారు.

ఈ నెల 4వ తేదీన ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న‌ప్పుడు అమితాబ్‌కు గాయాల‌య్యాయి. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చిత్ర యూనిట్ హుటాహుటిన అమితాబ్‌ను గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. అక్క‌డ బిగ్ బిని ప‌రీక్షించిన వైద్యులు అత‌ని ప‌క్క‌టెముక‌లు విరిగిన‌ట్లు నిర్ధారించారు. రెండు రోజుల పాటు ఆస్ప‌త్రిలోనే చికిత్స తీసుకున్న అమితాబ్‌.. ఇవాళ ఉద‌యం ముంబైకి వెళ్లారు. అక్క‌డే త‌న నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విష‌యాలు అన్నింటినీ తాజాగా అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న బ్లాగ్‌లో వెల్ల‌డించ‌డంతో ఈ విషయం వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్‌.. అమితాబ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News