Tuesday, April 23, 2024
- Advertisment -
HomeEntertainmentVenkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్...

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Venkatesh Maha | దక్షిణాది సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన సినిమా అంటే అందరూ ముందుగా చెప్పేది బాహుబలి. ఈ సినిమా తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న సినిమా కేజీఎఫ్. కన్నడ చిత్ర సీమ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం సృష్టించింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. రాఖీ భాయ్‌గా యశ్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ అయిపోయారు. మొత్తంగా భారతీయ సినీ అభిమానులు అందరూ కేజీఎఫ్ సినిమాకు బ్రహ్మరథం పలికారు. అలాంటి గొప్ప సినిమాను ఒక చెత్త అంటూ తీసిపారేశాడు టాలీవుడ్ డైరెక్టర్. ఒక నీచ్ కమీనే గాడి స్టోరీని సినిమాగా తీస్తే ఆడియన్స్ పిచ్చిగా చూస్తున్నారంటే హద్దులు దాటి విమర్శించాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారా? కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే రెండు సినిమాలు తీసిన డైరెక్టర్ వెంకటేశ్ మహా.

వెంకటేశ్ మహా తీసిన కేరాఫ్ కంచరపాలెం సినిమాకు మంచి టాక్ వచ్చింది. కలెక్షన్స్ రాకపోయినా సరే ఈ సినిమా బాగుందని చెప్పుకున్నారు. ఇక ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా అయితే వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు. అంటే వెంకటేశ్ మహాకు కమర్షియల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఒక్క హిట్టు కూడా లేదు. ఈ అసహనాన్నే తాజాగా వ్యక్తపరిచాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేశ్ మహా తన అసహనాన్ని చూపించాడు. అయితే తన సినిమాలు చూస్తలేరని మాట్లాడితే ఏం కాకపోవు.. కానీ తనకు చేతగాక ఒక సూపర్ హిట్ సినిమాపై పడి ఏడ్చాడు. సినిమా పేరు చెప్పకుండా ఆ స్టోరీ చెబుతూ నీచంగా మాట్లాడాడు.

‘ ప్రపంచంలో తల్లి ఒక కొడుకును ఎప్పటికైనా గొప్పోడివి కావాలని అంటుంది. గొప్పోడు అంటే ఆమె దృష్టిలో బాగా సంపాదించాలని.. కానీ ఒక సినిమాలో అంతా కావాలని అడుగుతుంది.. ఆ అంత ఏదైతే కావాలని అడుగుతుందో దాన్ని తోడేవాళ్లు కొంతమంది ఉంటారు. వీడెళ్లి వాళ్లను ఉద్ధరిస్తాడు. తర్వాత ఒక పాట వస్తది. లాస్ట్‌కు వాళ్లందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తడు. మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పాడేస్తడు. వాడంతటి నీచ్ కమీన్ కుత్తే ఎవడన్నా ఉంటాడా? వాడిని కన్న ఆ మహాతల్లిని నాకు కలవాలని ఉంది.మహాతల్లి ఎక్కడైనా ఉంటే కలవాలని ఉంది. అలాంటి కుత్తే ఎవడని తల్లి అడిగితే ఆ కథను సినిమా తీస్తే.. మనం చప్పట్లు కొడతరు.’ అంటూ హద్దులు దాటి మాట్లాడాడు. ఇదే ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్స్ నందినిరెడ్డి, శివ నిర్వాణ, ఇంద్రగంటి మోహనకృష్ణ, వివేక్ ఆత్రేయ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూలో తోటి డైరెక్టర్ గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే.. ఖండించాల్సింది పోయి మిగిలిన డైరెక్టర్స్ కూడా పగలబడి నవ్వారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేజీఎఫ్ సినిమాపై వెంకటేశ్ మహా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. కేజీఎఫ్ సినిమా పార్కింగ్ కలెక్షన్స్ కూడా సంపాదించలేని నువ్వా.. ఆ సినిమాపై కామెంట్స్ చేసేది అని మండిపడుతున్నారు. దమ్ముంటే కేజీఎఫ్ రేంజ్ కాకపోయినా.. అందులో సగం సత్తా ఉన్న సినిమా అయినా తీసి నిరూపించుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్ మహాతో పాటు పక్కనే ఉండి పగలబడి నవ్విన డైరెక్టర్స్‌పై కూడా నెటిజన్లు సీరియస్ అయ్యారు. దీంతో నందిని రెడ్డి స్పందించి క్షమాపణలు చెప్పింది. ప్రతి కమర్షియల్ చిత్రం విజయం సాధిస్తుందంటే.. చిత్ర యూనిట్ శ్రమ ప్రేక్షకులకు నచ్చిందని అర్థం అని.. మేం చేసిన వ్యాఖ్యలు ఎవరినీ కించపరచాలని కాదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అని నెటిజన్లను కోరింది. వెంకటేశ్ మహా హావభావాలకు మాత్రమే తనకు నవ్వొచ్చిందని.. కానీ అది ఎలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చిందో ఇప్పుడే తనకు అర్థమైందని క్లారిటీ ఇచ్చింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News