Home News International China spy Balloon | చైనాతో మళ్లీ కాలు దువ్వుతున్న అమెరికా.. నిఘా బెలూన్‌ పేల్చివేత!

China spy Balloon | చైనాతో మళ్లీ కాలు దువ్వుతున్న అమెరికా.. నిఘా బెలూన్‌ పేల్చివేత!

Image Source: Pixabay

China spy Balloon | చైనాకు చెందినదిగా భావిస్తున్న స్పై బెలూన్‌ను అమెరికా కూల్చి వేసింది. తూర్పు తీర ప్రాంతంలో చైనా స్పై బెలూన్‌ను కూల్చి వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని పెంటగాన్ అధికారులు వెల్లడించారు. తమ సార్వభౌమతత్వాన్ని ఉల్లఘించినందుకు చైనాకు సరైన సమాధానమిచ్చామని వారు వివరించారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, జాతీయ భద్రతా బృందం ఎల్లప్పుడూ అమెరికన్‌ ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి లాయిడ్‌ అస్టిన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే చైనాకు చెందినదిగా భావిస్తున్న నిఘా బెలూన్‌ను కూల్చివేతకు సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఆ వీడియోల్లో మొదట చిన్న పేలుడు కనిపించింది. ఆ తర్వాత ఆ బెలూన్ నీటిలో పడిపోతున్నట్టు కనిపించింది.

శిథిలాలన్నీ సముద్రంలో పడే విధంగా అధికారులు ప్లాన్ చేశారు. బెలూన్ సముద్రంలో పడిపోతుండటంతో సముద్రంలో అమెరికా రక్షణ శాఖ నౌకలను మోహరించారు. బెలూన్ కు సంబంధిచిన శిథిలాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకు ముందు బెలూన్ గురించి మీడియా అడిగిన విషయంపై బిడెన్ స్పందిస్తూ… ఆ విషయాన్ని తాము చూసుకుంటామన్నారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే బెలన్‌ను అధికారులు కూల్చి వేశారు.

మండిపడ్డ చైనా

అమెరికా-చైనా మధ్య అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. తమ స్పై బెలూన్ ని అమెరికా కూల్చివేయడం పట్ల చైనా మండిపడింది. ఇందుకు మా స్పందన ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తామని అమెరికాను హెచ్చరించింది. మీరు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారని, అంతర్జాతీయ ప్రమాణాలను అతిక్రమిస్తున్నారని చైనా ఆరోపించింది. మీ చర్య పట్ల తీవ్ర అసంతృప్తిని, నిరసనను ప్రకటిస్తున్నాం.. అది అసలు మానవ రహిత సివిలియన్ ఎయిర్ షిప్.. వాతావరణ పరిశోధనల కోసం దాన్ని వినియోగించినప్పుడు దిశ మార్చుకుని అది అమెరికా వైపు వచ్చింది అని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

అమెరికాకు చైనా వార్నింగ్

ఇందుకు మా ప్రతిస్పందనను తెలియజేసే హక్కు మాకుంది అని అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ రక్షణ రహస్యాలను పసిగట్టేందుకు చైనా ప్రయోగించిన గూఢచర్య బెలూన్ గా అనుమానించిన అమెరికా నిన్న తమ దేశ గగనతల పరిధిలోని ఈ బెలూన్ ని యుద్ధ విమానాల సాయంతో అట్లాంటిక్ సముద్ర తలాల వైపునకు తీసుకువచ్చి పేల్చివేసింది.

దక్షిణ కాలిఫోర్నియా మర్దల్ బీచ్ ప్రాంతంలో ఈ బెలూన్ శకలాలు పడ్డాయి. వీటిని సేకరించేందుకు అమెరికా సైనిక సిబ్బంది ప్రయత్నాలు చేశారు. మా కీలకమైన రక్షణ స్థావరాల సమాచారాన్ని తెలుసుకునేందుకే చైనా ఈ బెలూన్ ని ప్రయోగించిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, రక్షణ శాఖ మంత్రి ల్యాడ్ ఆస్టిన్ అంతకుముందు ఆరోపించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Musharraf | దుబాయిలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ కన్నుమూత

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

Wildfire | రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు.. 13 మంది సజీవ దహనం

North Korea | కిమ్‌ ఎంత పని చేయిస్తున్నావయ్యా.. హ్యాకర్లతో రూ.14 వేల కోట్లు కొట్టేశావా?

Afridi Marriage | ఒక ఇంటివాడైన అఫ్రిది.. దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురితో ‘నిఖా’

Exit mobile version