Home News International North Korea | కిమ్‌ ఎంత పని చేయిస్తున్నావయ్యా.. హ్యాకర్లతో రూ.14 వేల కోట్లు కొట్టేశావా?

North Korea | కిమ్‌ ఎంత పని చేయిస్తున్నావయ్యా.. హ్యాకర్లతో రూ.14 వేల కోట్లు కొట్టేశావా?

Image Source: Pixabay (ప్రతీకాత్మక చిత్రం )

North Korea | ఉత్తర కొరియా.. ఈ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది దాని అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఎన్నో కఠిన ఆంక్షలు, శిక్షలు అమలు చేయడంలో ఎవరైనా కిమ్‌ తరువాతే. ఓ పక్క ఐక్యరాజ్య సమితి ఆంక్షలు.. మరో పక్క ఆర్థిక సంక్షోభంతో పూర్తిగా కొట్టుమిట్టాడుతోంది ఉత్తర కొరియా. అయినా కిమ్ మాత్రం తన అణ్వాయుధ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అసలు తినడానికే లేనప్పుడు ఈ పరీక్షలకు ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది అని చాలా దేశాల సందేహం. అది అంతా కూడా కిమ్‌ దగ్గర ఉన్న హ్యాకర్ల సామర్ధ్యమట.

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో ఎంతో పకడ్బందీగా నడిపే క్రిప్టో ఎక్స్‌చేంజిలో ఉత్తర కొరియా హ్యాకర్లు ఎంటర్‌ అయిపోయి వేల కోట్లను తస్కరిస్తున్నారట. అలా గతేడాది వారు కాజేసిన మొత్తం… 1.7 బిలియన్‌ డాలర్లు( అంటే దాదాపు రూ.13.9 వేల కోట్లు). ఈ విషయాన్ని చైన్‌ ఎనాలసిస్‌ అనే విశ్లేషణ సంస్థ వివరించింది.

  • ఈ హ్యాకర్లు 2022లో 1.7 బిలియన్ డాలర్ల క్రిప్టోను కాజేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

అంతక్రితం ఏడాది కొల్లగొట్టిన 429 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఉంది. గడిచిన సంవత్సరం మొత్తం 3.8 మిలియన్ డాలర్ల క్రిప్టోలను హ్యాకర్లు దోపిడీ చేయగా… ఇందులో 44 శాతం ఉత్తర కొరియా నేరగాళ్లు చేసినవే అని సంస్థ పేర్కొంది. చైనా, నాన్ -ఫంగిబుల్‌ టోకెన్స్‌ బ్రోకర్ల ద్వారా ఈ హ్యాకర్లు క్రిప్టోలను దొంగిలిస్తున్నట్లు చైన్‌ ఎనాలసిస్‌ వివరించింది. ఇప్పటికే అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా.. తన అణ్వాయుధ ప్రయోగాల నిధుల కోసం క్రిప్టో నేరాలకు పాల్పడుతోంది.

ఇప్పటికే ఉత్తర కొరియాకు డాలర్లు చేరకుండా అమెరికా ఆంక్షలు విధించింది. అందుకే ఉత్తర కొరియా క్రిప్టోలను దొంగిలించి వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే వాటిని తయారు చేసుకునే ఆర్థిక స్థోమత లేక ఇలా మోసాలకు పాల్పడుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఆ దొంగ సొమ్ముతోనే అణ్వాయుధాలు, క్షిపణులను తయారు చేసుకుంటున్నారని పరిశోధక బృందాలు గతంలోనే వెల్లడించాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Free Flight Tickets | హాంకాంగ్ బంపర్ ఆఫర్.. 5 లక్షల మందికి ఫ్రీగా విమాన టికెట్లు

Super Cows | లక్ష లీటర్ల పాలు ఇచ్చే ఆవులను సృష్టించిన చైనా.. క్లోనింగ్‌ ద్వారా సరికొత్త సృష్టి

Viral News | విమాన టికెట్ కొనాల్సి వస్తుందని కన్నబిడ్డనే వదిలి వెళ్లడానికి సిద్ధమైన తల్లిదండ్రులు.. దారుణం!

Viral News | బాల భీముడు.. భలే ముద్దొస్తున్నాడుగా.. 8 కేజీల బరువుతో శిశువు జననం

Queen Elizabeth II | కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగింపు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Exit mobile version