Home News International Wildfire | రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు.. 13 మంది సజీవ దహనం

Wildfire | రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు.. 13 మంది సజీవ దహనం

Wildfire | చిలీలో కార్చిచ్చు దావానంలా వ్యాపిస్తుంది. రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబయో, నుబుల్ ప్రాంతంలో ఏర్పడిన అగ్నికీలలు దావానంలా వ్యాపిస్తున్నాయి. వేడిగాలుల ప్రభావంతో 14వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఈ మంటలు ఇప్పుడు రహదారులపైకి కూడా దూసుకొస్తున్నాయి. ఈ మంటలను అదుపు చేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సేవల బృందానికి చెందిన హెలికాప్టర్ కూడా కూలిపోయింది.

కార్చిచ్చు అదుపులోకి రాకపోవడంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అక్కడి హోంమంత్రి కరోనాలినా తోహా తెలిపారు. అటవీ సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. ప్రస్తుతానికి చిలీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

Exit mobile version