Home Latest News Vijaya shanti | వచ్చే ఎన్నికల్లో పోటీపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. కాళేశ్వరం ఒక పనికిమాలిన...

Vijaya shanti | వచ్చే ఎన్నికల్లో పోటీపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. కాళేశ్వరం ఒక పనికిమాలిన ప్రాజెక్ట్‌ అంటూ తీవ్ర వ్యాఖ్యలు !

Vijaya shanti | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసమే పట్టుదలగా రాజకీయాల్లోకి వచ్చినట్లు బీజేపీ నేత విజయశాంతి తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ టీవీ ఛానెల్‌తో విజయశాంతి మాట్లాడారు. తెలంగాణ సాధించి ప్రజల్లో ఆనందాన్ని చూడాలనే ఆశయంతో 1998లో రాజకీయాల్లోకి అడుగులు వేసినట్లు తెలిపారు.

అనుకున్నట్లే తెలంగాణ వచ్చింది కానీ… ప్రజల జీవితాలు మాత్రం అలానే ఉన్నాయన్నారు.

ఒకప్పుడు నిజాం రాజుల దగ్గర బానిసలుగా ఉన్న ప్రజలు.. ఇప్పుడు దొరల పాలనతో ప్రజలను మళ్లీ బానిసలుగా మార్చేశారని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ ఏర్పడటం వల్ల కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లాభం జరిగిందని విమర్శించారు.

కట్టిన ప్రాజెక్టుల వల్ల ప్రజలకు నీరు మాత్రం రావడం లేదని, రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం అనే ఒక పనికి మాలిన ప్రాజెక్టు కట్టారని దుయ్యబట్టారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ సర్కార్‌.. రూ. 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిందని మండిపడ్డారు.

తెలంగాణ డబ్బుల్ని బీఆర్‌ఎస్‌ పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.

చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్‌ అని అన్నారు. కేసీఆర్‌పై పోరాడటానికి తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉందని, కానీ తమ పార్టీ సభలకు, పాదయాత్రలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని విజయశాంతి వాపోయారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి.. చేయాల్సిన అభివృద్ధి చేశానని చెప్పారు. ఇప్పుడు తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేంద్రం డిసైడ్‌ చేస్తుందని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో దేనికి పోటీ చేసేది త్వరలో తెలుస్తుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

vijaya shanti, bjp, brs, kaleshwaram, telangana politics, politics, telugu news, latest news, breaking news, telangana news,

Exit mobile version