Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & Vaasthuhoroscope today | రాశిఫలాలు (20-01-2023 )

horoscope today | రాశిఫలాలు (20-01-2023 )

horoscope today | మేషం

చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

వృషభం

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. కోపతాపాలు, వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాల్లో సొంత నిర్ణయాలు మేలు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు.

మిథునం

దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్న సన్నిహితుల సాయంతో తీరుస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. సోదరుల నుంచి ధన, వస్తు లాభం పొందుతారు. నూతన విద్య అవకాశ సూచన.

కర్కాటకం

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక అభివృద్ది సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. మీ మాటకు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వస్తు లాభ సూచన ఉంది.

సింహం

కుటుంబసభ్యులతో ఏర్పడిన విబేధాలు తొలగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామి సాయం అందుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సంతానానికి నూతన విద్య అవకాశాలు అందుతాయి. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కన్య

వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ధనలాభ సూచన ఉంది.

తుల

ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. గృహ, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

వృశ్చికం

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మిత్రుల సాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. అనుకోని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.

ధనుస్సు

భాగస్వామ్య వ్యాపారాల్లో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. మిత్రుల సాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

మకరం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరుల నుంచి సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాల్లో స్థాన మార్పిడి ఉంటుంది. ధన, వస్తు లాభాలు పొందుతారు.

కుంభం

సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుకోని అతిథుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం అందుకుంటారు.

మీనం

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక వృద్ధి సాధిస్తారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News