Wednesday, May 22, 2024
- Advertisment -
HomeNewsAPAyyanna Vs Ganta | అసలు ఎవరండీ గంటా శ్రీనివాస్‌రావు.. లక్షల్లో ఒకడు అంటూ మాజీ...

Ayyanna Vs Ganta | అసలు ఎవరండీ గంటా శ్రీనివాస్‌రావు.. లక్షల్లో ఒకడు అంటూ మాజీ మంత్రి అయ్యన్న షాకింగ్‌ కామెంట్స్‌

Ayyanna Vs Ganta | టైమ్‌2న్యూస్‌, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన… ” పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ దాక్కున్నాడో తెలియని పెద్ద మనిషి.. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పార్టీ కార్యకలాపాల్లోకి వస్తున్నాడు. అసలు ఎవరండీ గంటా… లక్షల్లో ఒకడు, అదే లక్షల్లో నేను కూడా ఒకడిని” అంటూ అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు..

గంటా శ్రీనివాసరావు ఏమైనా పెద్ద నాయకుడా..? ప్రధానా అంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్న అయ్యన్న.. తనకు అందరూ కావాలని అన్నారు. టీడీపీకి మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల వారే అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఒక దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఒక రాజధాని కూడా లేదు. అధికారం లేని హోంమంత్రి పదవి ఉంటే ఎంత.. లేకపోతే ఎంత అని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శాంతిభద్రతలు ఎలా ఉండాలో చేసి చూపిస్తామన్నారు. తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించాడు.

నర్సీపట్నం నుంచి పోటీ చేసిన అయ్యన్న ఓటమి పాలయ్యాడు. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు పీఏసీ ఛైర్మన్‌ పదవిని ఆశించారు. కానీ పీఏసీ పదవిని చంద్రబాబు పయ్యావుల కేశవ్‌కు కట్టబెట్టారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైసీపీలోకి గంటా జంప్ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. కానీ ఆయన పార్టీ మారింది లేదు.

అయితే కొద్ది రోజుల క్రితమే గంటా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో భేటీ అయ్యారు. అంతే కాకుండా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. తన ఆరోగ్య సమస్యలతో పాటు కరోనా రావడం వల్ల తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు గంటా వివరించారు. ఇక నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉంటానని ప్రకటించారు. 2014లో ఎన్నికలకు ముందు గంటా కాంగ్రెస్ నుంచి టీడీపీకి మారారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో గంటా మంత్రిగా పనిచేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

Sriharikota | శ్రీహరి కోటలో వరుస ఆత్మహత్యలు.. నిన్న ఎస్సై, కానిస్టేబుల్.. ఇవాళ ఎస్సై భార్య బలవన్మరణం

Andhra Pradesh | సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. దీని చుట్టే ఇప్పుడు రాజకీయాలు!

Pawan kalyan | వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం.. కమెడియన్ అలీ సెన్సేషనల్ కామెంట్స్

RK Roja | పవన్ ఎపిసోడ్ వచ్చాక బాలయ్య టాక్ షోకి వెళ్లొద్దనే నిర్ణయించుకున్నా.. రోజా అన్‌స్టాపబుల్ పంచ్‌లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News