Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsInternationalUsain Bolt | రూ. 100 కోట్లు పోగొట్టుకున్న పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్.. అకౌంట్‌లోని...

Usain Bolt | రూ. 100 కోట్లు పోగొట్టుకున్న పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్.. అకౌంట్‌లోని నుంచి సొమ్మంతా ఖాళీ

Usain Bolt | జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఆర్థిక మోసం బారిన పడి.. రూ.100 కోట్లకు పైగా పోగొట్టుకున్నాడు. ఓ ప్రైవేటు పెట్టుబడుల సంస్థలో ఉసేన్ బోల్డ్‌కు అకౌంట్ ఉంది. అందులో 12.8 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.103 కోట్లు ఉన్నాయి. అందులోంచి రూ.100 కోట్లకు పైగా డబ్బు తాజాగా మాయమైంది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగే ఈ డబ్బును మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు.

జమైకాలోని స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలో ఉసేన్ బోల్ట్ అకౌంట్ తెరిచాడు. అందులోనే తనకు వచ్చిన రిటైర్మెంట్, లైఫ్ టైం సేవింగ్స్ డబ్బు దాదాపు 12.8 మిలియన్ డాలర్లు ఉంచాడు. ఇప్పుడు అందులో కేవలం 1200 డాలర్లు మాత్రమే ఉంది. దీనిపై బోల్ట్ తరఫున న్యాయవాదులు స్పందించారు. పది రోజుల్లో ఆ డబ్బును బోల్ట్ ఖాతాలో జమ చేయాలని లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు తమ సంస్థలో జరిగిన మోసాన్ని జనవరి మొదటి వారంలోనే గుర్తించినట్లు స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. మాజీ ఉద్యోగి వల్ల తమ క్లయింట్ల ఖాతా నుంచి డబ్బు మాయమైందని పేర్కొంది. ఒక్క ఉసేన్ బోల్ట్ మాత్రమే కాదు.. దాదాపు 30 మంది క్లయింట్లు తమ సొమ్మును కోల్పోయారని తెలిపింది. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. దీనిపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్ స్పందించారు. దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ బాధ్యతలను ప్రభుత్వం తన ఆదీనంలోకి తీసుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

Manchu Manoj | భూమా మౌనికతో పెళ్లిపై రేపు క్లారిటీ రానుందా.. మంచు మనోజ్ ఏం గుడ్ న్యూస్ చెబుతాడో..!

Fire Accident | సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. డెక్కన్ స్పోర్ట్స్ షాప్‌లో చెలరేగిన మంటలు..

New Zealand PM | న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

Bandi Sanjay on BRS sabha | బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్.. మహిళలు అంటే కేసీఆర్ బిడ్డ కవిత ఒక్కరేనా.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News