Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsInternationalHockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో వేల్స్‌పై భారత్‌ ఘన విజయం.. క్వార్టర్స్‌ చేరాలంటే...

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో వేల్స్‌పై భారత్‌ ఘన విజయం.. క్వార్టర్స్‌ చేరాలంటే క్రాస్‌ ఓవర్‌ తప్పనిసరి.

Hockey World Cup | టైమ్‌ టు న్యూస్‌, భువనేశ్వర్‌: స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్‌లో భారతో రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్‌-‘డి’లో భాగంగా.. గురువారం జరిగిన పోరులో టీమిండియా 4-2 తేడాతో వేల్స్‌ను చిత్తుచేసింది. గ్రూప్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గి.. ఒకదాన్ని డ్రా చేసుకున్న భారత్‌ నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

గ్రూప్‌ అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు మాత్రమే ఆ అవకాశం ఉండగా.. ఇంగ్లండ్‌ ఆ చాన్స్‌ కొట్టేసింది. పాయింట్ల (7) పరంగా ఇరు జట్లు సమానంగానే నిలిచినా.. ఆఖరి పోరులో స్పెయిన్‌ను 4-0తో చిత్తు చేసిన ఇంగ్లండ్‌ గోల్స్‌ తేడాలో ముందంజలో నిలిచి నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో స్థానంలో ఉన్న భారత్‌.. క్వార్టర్స్‌కు చేరాలంటే క్రాస్‌ ఓవర్‌ పోరులో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది.

ఇక చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (22వ, 45వ నిమిషల్లో) డబుల్స్‌ గోల్స్‌తో విజృంభించగా.. శంషేర్‌ సింగ్‌ (21వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (59వ నిమిషంలో) చెరో గోల్‌ కొట్టారు. శంషేర్‌ భారత జట్టు ఖాతా తెరువగా.. నిమిషం వ్యవధిలోనే ఆకాశ్‌దీప్‌ గోల్‌తో భారత్‌ తిరుగులేని ఆధిపత్యం నబర్చింది. అయితే ద్వితీయార్ధంలో కోలుకున్న వేల్స్‌.. వరుస దాడులతో భారత ఆటగాళ్లను కలవర పెట్టింది.

ఈ క్రమంలో గారెత్‌ ఫార్లాగ్‌, జాకబ్‌ డ్రపర్‌ వేల్స్‌కు ఒక్కో గోల్‌ అందించడంతో ఆ జట్టు 2-2తో స్కోరు సమం చేసింది. కాసేపటికే ఆకాశ్‌దీప్‌ అద్వితీయమైన ఫీల్డ్‌ గోల్‌తో ఆధిక్యం పెంచగా.. మ్యాచ్‌ చివరి క్షణాల్లో లభించిన పెనాల్టీని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ సునాయాసంగా గెలుపొందింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rohit Sharma Interview | ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు డబుల్ సెంచరీ వీరులు.. వైరల్‌ అవుతున్న రోహిత్‌ శర్మ ఇంటర్వ్యూ వీడియో

Australian Open | ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నుంచి నాదల్‌ ఔట్‌.. జొకోవిచ్‌కు రూట్‌ క్లియర్‌

Uppal Match | ఉప్పల్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Uppal Match | హోంగ్రౌండ్‌లో బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.. గల్లీబాయ్‌కు అండగా రోహిత్‌ శర్మ

Junior NTR | యంగ్‌ టైగర్‌ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News