NTR | తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మార్మోగుతున్న పేర్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వీరి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ గతంలో చెప్పిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
తారక్ మంచి డ్యాన్సర్. తనతో పాటు స్టెప్పులు వేయడం అంత ఈజీ కాదు.. తన స్పీడ్‌ను అందుకోవడం అంత ఈజీ కాదని చాలామంది హీరోయిన్లు చాలా సందర్భాల్లో చెప్పారు. కేవలం డ్యాన్స్‌లు మాత్రమే కాదు డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా ఎన్టీఆర్ స్పీడ్ అందుకోవడం అంత ఈజీ కాదు. ఇదే విషయాన్ని శుభలేక సుధాకర్ కూడా చెప్పాడు. వీళ్లిద్దరూ అరవింద సమేత సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో మీడియాతో మాట్లాడిన శుభలేక సుధాకర్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. సెట్లో తారక్ చాలా సరదాగా, కలివిడిగా ఉంటారు. షాట్ రెడీ అనగానే కెమెరా ముందుకు వెళ్తారు. ఇక అప్పుడు ఆయనను పట్టుకోవడం కష్టమే అని తెలిపారు.
ఎలాంటి సీన్ అయినా సరే తారక్ ఎదురుగా ఉన్న నటులు టేకులు తీసుకోవాలే తప్ప ఆయన మాత్రం సింగిల్ టేక్‌లో చెప్పేస్తాడు అని శుభలేఖ సుధాకర్ తన ఇంటర్వ్యూలో చెప్పాడు. అసలు తారక్ ఎప్పుడూ కూడా సెట్లో డైలాగ్స్ చూసుకోవడం చూడలేదని పేర్కొన్నాడు. కానీ ఎన్ని పేజీల డైలాగ్స్ అయినా సింగిల్ టేక్ లో చెప్పేవాడు. తనలోని కసిని .. కృషిని దగ్గరగా చూసినవారిలో నేను ఒకడిని అంటూ చెప్పుకొచ్చాడు. తారక్ కెమెరా కోసమే పుట్టారేమో అనిపిస్తుంది. ఇదంతా కూడా ఆయనకు సినిమా పట్ల ఉన్న కసి, కృషి అనే చెప్పవచ్చు. తారక్ ఓ వండర్ కిడ్ అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్
Viral News | డంప్ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ
Naveen Murder Case | నవీన్ మర్డర్ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల