Home News International Insider Trading | అమెరికాలో అక్రమంగా 60కోట్లు సంపాదించిన ఇండియన్.. 25 ఏళ్ల జైలు శిక్ష...

Insider Trading | అమెరికాలో అక్రమంగా 60కోట్లు సంపాదించిన ఇండియన్.. 25 ఏళ్ల జైలు శిక్ష !

Image by drobotdean on Freepik

Insider Trading | అమెరికాలో ఓ భారతీయుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఓ కంపెనీ అంతర్గత సమాచారాన్ని అక్రమంగా సేకరించడం ద్వారా రూ.60కోట్ల వరకు సంపాదించాడు. ఇప్పుడు ఈ విషయం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు.

బరమా శివన్నారాయణ ( Barama Sivannarayana ) అనే ఇండో అమెరికన్ ఐటీ నిపుణుడు. కాలిఫోర్నియాలోని సిలికన్ వ్యాలీలో పలు ఐటీ కంపెనీల్లో పనిచేశాడు. తర్వాత పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ( Palo alto networks ) అనే కంపెనీకి కాంట్రాక్టర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో ఆ కంపెనీలో పనిచేసే ఓ ఐటీ ఉద్యోగితో శివన్నారాయణ పరిచేయం పెంచుకున్నాడు. అతని సహాయంతో కంపెనీ త్రైమాసిక ఫలితాలను ముందుగానే తెలుసుకునేవాడు. అధికారికంగా ప్రకటించడం కంటే ముందే ఫలితాలు తెలుసుకోవడంతో స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టేవాడు.

అలా 2016 అక్టోబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు అంతర్గత వివరాలను తెలుసుకోవడం ద్వారా దాదాపు 73 లక్షల డాలర్లు (రూ.60కోట్లు ) సంపాదించాడు. ఈ విషయం బయటపడటంతో శివన్నారాయణను అదుపులోకి తీసుకున్నారు. తమ కంపెనీ ఆర్థిక సమాచారాన్ని తానే అందించానని పాలో అల్టో నెట్‌వర్క్‌కు చెందిన ఉద్యోగి 2019లో ఒప్పుకున్నాడు. కాగా అంతర్గత సమాచారాన్ని సేకరించడం ద్వారా శివన్నారాయణ స్టాక్ మార్కెట్లలో ఎక్కువ మొత్తంలో లాభాలు సాధించినట్టు తాజాగా ఆధారాలు కూడా లభించాయి. దీంతో శివన్నారాయణకు 25 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యూయార్క్ మీడియా వెల్లడించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Exit mobile version