Home News International Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే...

Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!

Corona cases | చైనా సహా ప్రపంచ దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ భారత్‌లోనూ డేంజర్‌ బెల్స్‌ మోగించనుందా? వచ్చే నెలలో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందా ? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. గతంలో వచ్చిన కరోనా వేవ్‌ల ఆధారంగా భారత్‌లో జనవరిలో కేసులు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

చైనాలో భారీగా కేసులు నమోదవుతుండటంతో కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్‌ చేయడమే కాకుండా పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి. భారత్‌లో జనవరిలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశాయి. రాబోయే 40 రోజులు కీలకమని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించాయి. ఈ నేపథ్యంలోనే చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, థాయిలాండ్‌, సింగపూర్‌ నుంచి భారత్‌కు వచ్చే విమాన ప్రయాణీకులకు కరోనా నెగెటీవ్‌ రిపోర్టును తప్పనిసరి చేయనున్నారు. ఈ నిబంధనను వచ్చే వారం నుంచి అమలు చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గతంలో తూర్పు ఆసియాలో కరోనా కొత్త వేవ్‌ మొదలైన 30-35 రోజుల తర్వాత భారత్‌లో వైరస్‌ వ్యాప్తి మొదలైందని, దాన్ని బట్టే ఇప్పుడు భారత్‌లో జనవరిలో కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భారత్‌లో మరో కొత్త వేవ్‌ వచ్చినా ప్రమాదం అంతగా ఉండదని పేర్కొన్నారు. అయితే ఈనెల 24 నుంచి 26 వరకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల్లో 39 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Exit mobile version