Home Latest News Dubbak bus stand | దుబ్బాక నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సు.. శుక్రవారమే ప్రారంభం

Dubbak bus stand | దుబ్బాక నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సు.. శుక్రవారమే ప్రారంభం

Dubbak bus stand | అధునాతన హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న దుబ్బాక బస్టాండ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 30 (శుక్రవారం)న మంత్రులు తన్నీరు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి బస్టాండును ప్రారంభించనున్నారు. దీంతో పాటు తిరుపతి, హన్మకొండ రూట్లలో కూడా బస్సు సర్వీసులను ప్రారంభించనున్నారు.

దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించిన దుబ్బాక బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. బస్టాండ్ పునర్నిర్మాణ విషయాన్ని మంత్రి హరీశ్ రావు సహకారంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. బస్టాండ్ నిర్మాణానికి రూ.3.70 కోట్లను మంజూరు చేశారు. దీంతో గత ఏడాది ఆగస్టులో మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా తానే ఓ ప్రైవేటు సంస్థతో నమూనా చిత్రాలను తీయించారు. ఆ నమూనా ప్రకారం సుమారు ఎకరా 10 గుంటల విస్తీర్ణంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టారు.

బస్టాండు భవనంలో 346 చదరపు అడుగుల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్, మెజనైన్ ఫోర్లు నిర్మించారు. ఇందులో 8 దుకాణ సముదాయాలు. ఒక కేఫ్, కంట్రోల్ రూం, బస్ పాస్ కౌంటర్, 6 ప్లాట్‌ఫాంలు నిర్మించారు. 615 చదరపు అడుగుల స్థలంలో మొదటి అంతస్తును నిర్మించారు. ఇందులో రెస్టారెంట్, డ్రైవర్ల విశ్రాంత గది, ఆఫీస్ రూం ఉన్నాయి. అధునాతన పద్ధతుల్లో మరుగుదొడ్లు నిర్మించారు. పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు, ప్రహారీ నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దుబ్బాక బస్ డిపోతో పాటు సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, పికెట్ డిపోలకు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు తిరుపతి, హన్మకొండ రూట్లలో బస్సు సర్వీసులను నడిపించనున్నారు.

మరిన్ని రూట్లలో బస్సులు నడిచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా : ఎమ్మెల్యే

దుబ్బాక బస్టాండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు. వేగవంతంగా బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక పరిసర ప్రాంతాలకు సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో బస్సులు నడిపించాలని అసెంబ్లీలో ప్రస్తావించానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్ని రూట్లలో బస్సులు నడిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని పేర్కొన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Exit mobile version